పిటిషన్లపై రేపు విచారణ

  పిటిషన్లపై రేపు విచారణ

రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ దాఖలైన మొత్తం 12 పిటిషన్లు సుప్రీం కోర్టులో రేపు(శుక్రవారం) విచారణకు రానున్నాయి. ఈ పిటిషన్లపై హెచ్ఎల్ దత్తు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. విభజనకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బంహరి, రాయపాటి సాంబశివరావు, తదితరులు వేర్వేరుగా సుప్రీంలో పిటిషన్‌లు దాఖలు చేశారు.మరోవైపు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి సదాశివం ముందుకు కిరణ్ తరపు న్యాయవాదులు తీసుకువచ్చారు. విభజన ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కిరణ్ పిటిషన్‌లో పేర్కొన్నారు.