My Party name is Jana Sena Party - Kalyan (Pawan Kalyan)

నా పార్టీ పేరు జనసేన: పవన్‌కళ్యాణ్
గొప్పగా బతకాలని తానెన్నడూ ప్రయత్నం చేయలేదని, సామాన్యుడిలా
బతకాలనుకున్నానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. తాను రాజకీయాల నుంచి
మాట్లాడతానగానే తనను ఇష్టం వచ్చినట్టు తిట్టారని అందుకే పార్టీ పెట్టానని
వెల్లడించారు. తన పార్టీ పేరు ‘జనసేన’ అని ప్రకటించారు. తన పార్టీ
విధివిధానాలు తర్వాత వెల్లడిస్తానని చెప్పారు. తాను పార్టీ పెడుతున్నట్టు
తన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ తె
లియదన్నారు.
పదవుల పట్ల తనకు వ్యామోహం లేదన్నారు. అన్నయ్య చిరంజీవిపై కోపం ఉండదన్నారు.
‘తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యకు ఎదురెళ్లను’ అని అన్నారు.
ఢిల్లీ వాళ్ల కాళ్లు పట్టుకునే బానిసను కాదన్నారు. పదవులపై తనకు మోజు
లేదన్నారు. పదవులు నాకు చాలా తుచ్ఛమైనవి అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు నోవాటెల్‌కు చేరుకున్నారు. మెగా సినిమా
ఆడియో విడుదల కార్యక్రమం స్థాయిలో పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ ప్రకటన
కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికకు ఇరువైపులా రెండేసి ఎల్ఇడి
స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దాదాపు రాత్రి 7 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్
వేదిక మీదికి చేరుకున్నారు. తెల్ల ప్యాంట్, బూడిద రంగు కుర్తా వేసుకుని
ఆయన వేదికి మీదికి చేరుకున్నారు. ఆయనను వేదిక మీద చూడగానే అభిమానులు
కేరింతలు కొట్టారు. ఇది సామాన్యుడి సేన, ప్రతి ఒక్కరిసి సేన అనే నినాదం
తెరలపై కనిపిస్తుంది. దాంతో పాటు ఇది మన సేన, ఇది జనసేన అనే నినాదం కూడా
తెరలపై కనిపిస్తుంది.
నోవాటెల్ వద్ద పాసులు లేనివారిని పోలీసులు
అడ్డుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు, పోలీసులకు మధ్య స్వల్ప
తోపులాట జరిగింది. మెయిన్ గేట్ వద్ద గందరగోళం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్
అభిమానులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో అభిమానులు పరుగులు తీశారు.
చెప్పులను వదిలేసి వారు పరుగెత్తారు. వేదిక మీదికి చేరుకుంటూనే ఆయన తన
ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు, గతుకుల దారి,
గుండెల నిండా ధైర్యం ఉందని ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చిన్ననాటి
నుంచి ఎలాంటి పరిస్థితి వచ్చినా బాలగంగాధర్ తిలక్ రాసిన ఆ పద్యాన్ని
నెమరేసుకుంటానని ఆయన అన్నారు. దౌర్జన్యాన్ని, అవినీతిని అరికట్టడానికి
ముందుకు సాగుతానని ఆయన అన్నారు. పరికితనంతో నీ బాంచెన్ కాల్మోక్తా అనే
పిరికిపందను కాదు, ఢిల్లీలో ఉన్నవారిని కాల్మొక్తా అంటే మన రాష్ట్రాన్ని ఈ
పరిస్థితికి తెచ్చారని ఆయన అన్నారు.
అన్నయ్య చిరంజీవి స్థాపించిన
ప్రజారాజ్యం పార్టీలో పనిచేశానని, అన్నయ్య పార్టికీ ఎదురుగా నిలబడాల్సి
రావడం దురదృష్టకరమని, తండ్రి లాంటి అన్నయ్యను తాను ఎదిరించలేనని, అలాంటి
పరిస్థితిని ఢిల్లీలో కాంగ్రెసువాళ్లు కల్పించారని ఆయన అన్నారు. గొప్పగా
బతకాలంటే సాహసాలు చేయాల్సి వస్తుందని అన్నారు. తాను బానిసను కాదని ఆయన
చెప్పారు. ఐదేళ్ల క్రితం గుంటూరులో రాజకీయాలు మాట్లాడానని, ఆ తర్వాత
రాష్ట్ర పరిస్థితి మీద గానీ, రాజకీయాల గురించి గానీ మాట్లాడలేదని, దాన్ని
దేవుడికే వదిలేశానని ఆయన అన్నారు. రాజకీయాలంటే తనకు ఇష్టం లేదని, ఎంపీగా
గెలవాలని లేదు, మంత్రినీ ముఖ్యమంత్రిని కావాలని లేదని, ఇవన్నీ తనకు
తుచ్ఛమని ఆయన అన్నారు. నా తెలంగాణ, మన తెలంగాణ, పోరు తెలంగాణ అని ఆయన
అన్నారు. రాష్ట్రం విడిపోయిన పరిస్థితిని చూశారని ఆయన అన్నారు.
జనసేన పార్టీ పెట్టానని ఆయన అన్నారు. అందరిలాగా బతకాలని అనుకున్నానని, కానీ
సమస్యలు తన వద్దకే వచ్చాయని ఆయన అన్నారు. ఈ నెల 2వ తేదీన రాజకీయాల గురించి
మాట్లాడుతానని ప్రకటన విడుదల చేయాలని చెప్పానని ఆయన గుర్తు చేశారు. నోటికి
వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వస్తున్నా అని భరిస్తామని ఆయన అన్నారు.
విమర్శలు ఎలా ప్రారంభమయ్యాయంటే ఇప్పుడెందుకు వస్తున్నారని, ఇప్పుడేం
చేస్తారని అంటున్నారని ఆయన అన్నారు. తాను దిగ్విజయ్ సింగ్‌ను అడగాలని
అనుకున్నానని, మీకు నేను ఎలా కనిపిస్తున్నానని అడగాలని అనుకున్నానని ఆయన
అన్నారు. దిగ్విజయ్ సింగ్‌ను ఆయన ఢిల్లీ పవిత్రాత్మగా అభివర్ణించారు.
కెసిఆర్‌పై కూడా ఆయన దుమ్మెత్తి పోశారు. నువ్వు నన్ను చెప్పనీరాదే అని
కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. క్షమాపణ చెప్పి పార్టీ పెట్టాలని అన్న
కల్వకుంట్ల కవితపై ఆయన విరుచుకుపడ్డారు. నా తెలంగాణ గురించి నువ్వు
అనేదేమిటని ఆయన అడిగారు. కెసిఆర్ తిడితే తాను పడతానని ఆయన అన్నారు.
రాజకీయ నాయకులు తనను తిడితే పైకి వద్దామని అనుకుంటున్నారా అని ఆడిగారు.
రెండు నెలల ఎన్నికల ముందు ఇలా వచ్చి భయపడేవాడినైతే నిలబడగలిగేవాడినా అని
అడిగారు. పిరికితనమంటే తనకు చిరాకు అని ఆయన అన్నారు. చచ్చిపోవడానికైనా
సిద్ధపడుతానని ఆయన అన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయిందని ఆయన అన్నారు.
రాజకీయాల్లోకి రావాలని అనుకున్న తర్వాత అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత
దుర్మార్గ రాజకీయాల విషయంలో గుండెల్లో పెట్టుకునే అన్నయ్యను చూసిన తర్వాత
ఆగిపోవాలా అనుకున్నానని ఆయన అన్నారు. అన్నయ్యను చూసి ఆగిపోవాలని
అనుకున్నానని ఆయన అన్నారు. నాలుగు రోజుల క్రితం వ్యక్తిగతంగా
కలుసుకున్నానని, సమాజం ముఖ్యమా, వ్యక్తిగతం ముఖ్యమా అని ఆలోచించుకున్నానని,
అప్పుడు సమాజం ముఖ్యమని అనుకున్నానని ఆయన అన్నారు.
రాజకీయాలు
అవసరమా, ఏవో సినిమాలు తీసుకుంటూ ఉండకుండా అనుకున్నానని, తన ఇద్దరు
కూతుళ్లను చూశానని, పరికితనంతో రాజకీయం చేయలేమని అర్థమైందని, తాను
వదిలేస్తే వారు ఎలా ఉంటారని అనుకున్నానని, నిస్వార్థంగా రాజకీయాలు చేయాలంటే
ప్రాణాలకు తెగించి పోరాడాలని ఆయన అన్నారు. సమాజం ముఖ్యమని అనుకున్నప్పుడు
కుటుంబం చిన్నదిగా కనిపించిందని చెప్పారు. వ్యక్తిగతంగా తనకు శత్రువులు
లేరని, కోపం కూడా రాదని, ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక లేదని, తన మిత్రులు
చాలా మంది ఉన్నారని, వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒక్కరని ఆయన
అన్నారు. రాజకీయాల్లోకి రావడం త్రివిక్రమ్‌కు ఇష్టం లేదని ఆయన అన్నారు.
ప్రజలకు తెలియని మిత్రుడు ఉన్నారని, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను
ఆపలేదని, అది ఇప్పుడు జనసేన అయిందని ఆయన అన్నారు. జమ్మికుంట నుంచి తన
మిత్రుడు ఒకతను రాజు రవితేజ ఉన్నాడని, తాను తక్కువ కాకుండా ఆలోచిస్తూ
వచ్చామని, పార్టీ పెట్టాలనే ఆలోచనైతే లేదని ఆయన అన్నారు.
పెద్ద
రాజకీయ వేత్తలు తన వెంట లేరని ఆయన అన్నారు. సినిమాల మీద ఆసక్తి లేదని, ఉన్న
సినిమాలు పూర్తి చేస్తానని, కొత్త సినిమాలు తీయడం లేదని, దీనికి తనను
నిందించవద్దని, ఢిల్లీ పెద్దలను నిందించాలని ఆయన అన్నారు. పార్టీ పెడితే
పెట్టనీ గానీ దాన్ని కాంగ్రెసులో కలపాలని దిగ్విజయ్ సింగ్ అన్నారని, అదేదో
గంగానది అయినట్లు ఆయన మాట్లాడారని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు ఇంట్లోవారి
కన్నా దేశం, సమాజం ముఖ్యమని ఆయన అన్నారు. 16 ఏళ్లకు సచిన్ టెండూల్కర్
సిక్సర్లు కొడుతున్నాడని, నువ్వేమిటి పనీపాటా లేకుండా తిరుగుతున్నావని
అనేవారని, ఆడుకుందామంటే మైదానాలు లేవని ఆయన అన్నారు. తాను పార్టీ
పెడుతున్నట్లు నాలుగు రోజుల క్రితమే తన కుటుంబ సభ్యులకు తెలుసునని ఆయన
అన్నారు. తన మీద తనకు కోపం వచ్చేదని, ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని,
నిరాశానిస్పృహల వల్ల అలా అనిపించిందని ఆయన అన్నారు.
ప్రతి
పార్టీలోనూ వ్యక్తిగతంగా తనకు తెలిసిన నాయకులున్నారని, సన్నిహితంగా
మెలిగేవారున్నారని, కానీ సైద్ధాంతికంగా విభేదిస్తన్నానని, వాళ్ల ఆలోచన
సరళికీ తన ఆలోచనా సరళికీ కుదరదని ఆయన అన్నారు. రాజకీయాలు, రాజకీయ వ్యవస్థ
సమస్యలను పరిష్కరించడానికే గానీ జఠిలం చేయడానికి కాదని ఆయన అన్నారు. తనకు
చిన్నప్పటి నుంచి సామాజికస్పృహ ఉందని చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకం కాదు
తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, సీమాంధ్ర ఆత్మగౌరవం దెబ్బ తింటే కూడా
ఊరుకోనని, తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బ తింటే ఊరుకోనని ఆయన అన్నారు.విభజన
తీరు తనకు నచ్చలేదని ఆయన అన్నారు. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు
వెంకయ్యనాయుడు జైరాం రమేష్‌ను నిలదీయడం తనకు నచ్చిందని ఆయన అన్నారు. పవన్
కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తాడట, దౌర్భాగ్యం కాకుపోతే ఏమిటని అన్నారని,
విశిష్టమైన రాజకీయ నాయకులు మీరు అని, పార్లమెంటును ఎంత అసహ్యంగా
తీసుకువచ్చారో చూశానని, గౌరవంగా తేవాల్సిన తెలంగాణను ఎలా తెచ్చారో అందరూ
చూశారని ఆయన అన్నారు భగత్సింగ్ నీవు చచ్చిపోలేదని, తాను ఉన్నానని ఆయన
అన్నారు.
భగత్సింగ్ జీవితం తనకు స్ఫూర్తి అని ఆయన అన్నారు.
తెలంగాణలో తనకు నచ్చిన మంచి శాసనసభ్యుడు జగ్గారెడ్డి అని ఆయన
చెప్పుకున్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉఁదామని
చెప్పినవాడు జగ్గారెడ్డి అని, ఆలాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని నడిపి
ఉంటే స్వీట్లు పంచుకునేవారమని ఆయన అన్నారు. తనకు విహెచ్ అన్నా ఇష్టమని,
వెటకారం లేదని, నిజంగా చెబుతున్నానని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలు
భయాందోళనలకు గురి కావద్దని, తామున్నామని చెప్పారని పవన్ కళ్యాన్ అన్నారు.
మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని విహెచ్ అన్నారని, రాహుల్ గాంధీ ఒక్క
పెళ్లయినా చేసుకోలేదని ఆయన అన్నారు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదని
చెప్పారు గానీ బ్రహ్మచారి అని చెప్పలేదని, అది వేరే విషయమని ఆయన అన్నారు.
మూడుసార్లు పెళ్లి చేసుకుంటే రాజకీయాలకు పనికి రాడని అంటున్నారని, ఒకే ఒక్క
పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగేవారు రాజకీయాలు చేయవచ్చా అని ఆయన
అన్నారు.
తన వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తే, సోనియా గాంధీ
అల్లుడు రాబర్ట్ వద్రా వ్యక్తిగత జీవితం గురించి, రాహుల్ గాంధీ వ్యక్తిగత
జీవితాన్ని, ప్రతి నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీస్తానని ఆయన
అన్నారు. మీకు స్పైస్ కావాలేమో, అలా చెప్పదలిస్తే బోలెడంత మంది ఉన్నారని
ఆయన అన్నారు. ఆ పార్టీకీ, ఏ రంగానికీ చెందినవారైనా సరే, తన వ్యక్తిగత
జీవితాన్ని మాట్లాడితే మీ వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీస్తానని ఆయన
అన్నారు. తనకు పత్రికలు లేవని, అభిమానులున్నారని, యూట్యూబ్ ఉందని, సోషల్
నెట్‌వర్కింగ్ ఉందని ఆయన అన్నారు. తాను వ్యక్తిగత జీవితాన్ని విమర్శించనని,
ప్రజాజీవితాన్ని ఇబ్బంది పెట్టకుండా మీరేమైనా చేసుకోండని ఆయన అన్నారు
ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగేవి వినిపించవు, కనిపించవు అని ఆయన అన్నారు.
వాటి గురించి మాట్లాడవద్దని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా ఏవరి మీదా తాను
మాట్లాడబోనని, అది తన సంస్కారమని, మీరు మాట్లాడే ముందు మీ ముఖాన్ని అద్దంలో
చూసుకోవాలని ఆయన అన్నారు.
జన జాగృతి అధ్యక్షురాలు కవిత, ఆమె
కల్వకుంట్ల చంద్రశేఖర రావు అమ్మాయి అని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్లాలని
అన్నారని, తాను ప్రేమించే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తానా, లేదా అనేది
తన వ్యక్తిగత విషయమని, అది కవితకు గానీ, ఆమె కుటుంబానికి గానీ సంబంధం లేదని
ఆయన అన్నారు. కవిత తనకు చెల్లెలిలాంటిదని, తాను కవిత బాధనూ వేదననూ
అన్నయ్యగా అర్థం చేసుకున్నానని, కవిత అన్నయ్య కెటి రామారావు భావావేశాన్ని
అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు. తెలంగాణకు చెందిన ఓ ప్రజా సంఘం నాయకుడు
తనతో చెప్పారని, తాను దాచుకోలేనని, బయటకు తెస్తానని ఆయన అన్నారు. తెలంగాణ
జాగృతి సంస్థ పెట్టి చాలా విరాళాలు సేకరించారని చెప్పారని, అమెరికాలోని తన
మిత్రులు కూడా చెప్పారని ఆయన అన్నారు.
తెలంగాణ నాయకులకు ఆ డబ్బుల
వ్యవహారం చెప్పాల్సి వస్తుందని ఆయన అన్నారు. తనను తిట్టినా, తన మీద ఎలాంటి
రాతలు రాసినా వ్యక్తిగతంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సమాజానికి ఏదో
చేయగలనని అనుకున్నానని ఆయన అన్నారు. కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన
పార్టీ ఆవిర్భావ సభకు సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. సభను సాయంత్రం
ఆరు గంటల నుంచి పది గంటలలోపే ముగించాలని పోలీసులు ఆదేశించారు. అంతే
కాకుండా సభకు కేవలం 4 వేల మందికి మాత్రమే పాసులకు జారీ చేయాలని సూచించారు.
పాసులు లేనివారిని లోనికి అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం
చేశారు. ఇక పవన్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా నోవాటల్ హోటల్ను
పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 200మంది పోలీసులు బందోబస్తు
నిర్వహిస్తున్నారు. ‘జన సేన’ లక్ష్యాన్ని ప్రకటించడానికి ఇప్పటికే భారీ
ఏర్పాట్లు చేశారు. పవన్ కల్యాణ్ సన్నిహితులు, అభిమానులు మొత్తంగా ఐదు వేల
మంది కూర్చోవడానికి ఏర్పాటు చేశారు.
ప్రతి ఒక్కరికీ బార్ కోడ్
కలిగిన పాసులను జారీ చేశారు. పాసులపై పార్టీ లోగోను ముద్రించారు. ఆ బార్
కోడ్ ప్రకారం వారికి కేటాయించిన సీటులో మాత్రమే కూర్చోవాలని నిబంధన
పెట్టారు. సాయంత్రం 6.30 గంటలకు పవన్ కల్యాణ్ సమావేశపు వేదికపై నుంచి 45
నిమిషాల పాటు ప్రసంగించనున్నాడు. పార్టీ విధివిధానాలను అతడు స్వయంగా
వెల్లడించనున్నాడు. నేడు రాజకీయా పార్టీ జనసేన పేరు ప్రకటించనున్న పవర్
స్టార్ పవన్ కల్యాణ్కు ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె నటీ మంచు లక్ష్మీ
ఆల్ ది బెస్ట్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ
పవన్ కల్యాణ్కు ఆమె మద్దతు ప్రకటించారు. ప్రజల కోసం మంచి చేసే వారికి తన
మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తన కుటుంబసభ్యులు
ఎవరు పోటీ చేయడం లేదని వెల్లడించారు. ఓ వేళ పోటీ చేస్తే చెబుతానని
తెలిపారు. పవన్ పార్టీ తరపున ఎన్నికల్లో ఆమె కుటుంబ సభ్యులు ఎవరన్నా పోటీ
చేస్తారా అన్న ప్రశ్నకు లక్ష్మీ ప్రసన్నపై విధంగా సమాధానమిచ్చారు.
కొత్తగా వచ్చిన, రాబోతున్న రాజకీయ పార్టీలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
రాఘవులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, పవన్ కల్యాణ్
పార్టీలు రెండూ చివరికి కాంగ్రెస్లో కలిసే పార్టీలేనని ఆయన
శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కోసమే కొత్త పార్టీలు
పెడుతున్నారని రాఘవులు అన్నారు. రాష్ట్ర విభజనకు సీపీఎం వ్యతిరేకమని ఆయన
మరోసారి స్పష్టం చేశారు. సీమాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు
ప్రకటించాలని రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ
పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే బాగుందని సినీ నటుడు, రచయిత పోసాని
కృష్ణమురళి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ వైఎస్ జగన్
మోహన్ రెడ్డికే తన ఓటు అని అన్నారు. మెరుగైన సేవ చేసేవారికే ఓటు
వేస్తామన్నారు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చేరిన తాను ప్రస్తుతం
ఓటరుగానే ఉండిపోయానని పోసాని తెలిపారు. ప్రస్తుతం ఆ పార్టీలేదని... అయితే
తాను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లనని ఓటర్గానే ఉంటానని ఆయన చెప్పారు.
పవన్ కల్యాణ్ పెట్టబోయే జనసేన పార్టీలో తాను చేరటం లేదని పోసాని
కృష్ణమురళి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల్లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే బాగుందని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి
వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్
రెడ్డికే తన ఓటు అని అన్నారు. మెరుగైన సేవ చేసేవారికే ఓటు వేస్తామన్నారు.
ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చేరిన తాను ప్రస్తుతం ఓటరుగానే ఉండిపోయానని
పోసాని తెలిపారు. ప్రస్తుతం ఆ పార్టీలేదని... అయితే తాను ఏ రాజకీయ
పార్టీలోకి వెళ్లనని ఓటర్గానే ఉంటానని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్
పెట్టబోయే జనసేన పార్టీలో తాను చేరటం లేదని పోసాని కృష్ణమురళి స్పష్టం
చేశారు. పవన్ కళ్యాణ్ పెట్టబోతున్న జనసేన పార్టీ తెలంగాణ ప్రజల కళ్లల్లో
మట్టికొట్టేదేనని టీఆర్ఎస్ నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు.
2009లో
తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడింది చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం
పార్టీయేనని ఆయన ఆరోపించారు. తెలంగాణ వస్తుందనుకుంటే సామాజిక తెలంగాణ అనే
వాడిని కాదని చిరంజీవి అన్నారని ఈటెల గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో
పొత్తు ఉంటుందన్న ఆందోళన అవసరం లేదన్నారు. తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో
ఎన్నికల్లో తేలుతుందని కేసీఆర్ తనయుడు కేటీఆర్ అన్నారు. రెండు ఎంపీలు
సీట్లున్న టీఆర్ఎస్ ఏం చేస్తుందని విమర్శిస్తున్న పార్టీలకు రెండు సీట్లు
కూడా రావన్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని హామీయిచ్చిన సోనియా గాంధీ ఐదేళ్లు
ఎందుకు ఆగారని ఆయన ప్రశ్నించారు. ఉద్యమకారులపై కేసులు పెట్టినవారే తెలంగాణ
తెచ్చామంటే జనం నమ్మరని కేటీఆర్ అన్నారు.
ఆధారం: ఆన్‌లైన్‌లో సేకరణ