Spending more time on social networking is useful?

Spending more time on social networking is useful?

సోషల్ నెట్వర్కింగ్ ఈరోజు ఎంతో ప్రాచుర్యం పొందిన పదం. ఈ పదానికి ఎంతో విలువ ఉంది అనడం లో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఈ రొజుల్లొ. మనవారితో మనం కలిసి ఉండడం అనే ఒకప్పటి సాంప్రదాయ పదాతి ఈనాటి పరుగులు మరియి పోటి ప్రపంచం లో కష్ట సాధ్యమైన పని అని అనుకునే రోజుల్లో ఆ లోటుని ఈ మొబైల్ ఇంటర్నెట్ మరియు సోషల్ నెట్వర్క్ సైట్ లు చాల వరకు ఆ దూరాన్ని తగ్గించెసెయ్ అనే చెప్పాలి. ఒకప్పుడు ఒకరిని మరొకరు చూడడానికి కూడా వీలు లేని పరిస్థితులు ఉండేవి. మరి ఈరోజు హాయ్ గా రోజంతా మనకు కావలసిన వారితో కావలిసిన సమయం లో ఎటువంటి ఇబ్బంది మరియు ప్రయాస లేకుండా మనం మాట్లాడ గలం, చూడగలం, మన మనోభావాలను పంచుకొగలము.
ఇవన్ని చూస్తూ కూడా సోషల్ నెట్వర్కింగ్ అనేది ప్రమాదమైనది అనే ఎంతో మంది శాస్త్రవేత్తలు మేధావులు అభిప్రాయపడుతున్నారు. అతి సర్వత్ర వర్జయేత్ అనేది ఒక నానుడి. పెద్దలు చెప్పిన మాట. అర్ధం స్పష్టం గానే తెలుస్తొన్ది. ఏదైనా ఎక్కువగా చేస్తే అది ప్రమాదమే అని.
ఎంతో ప్రేమగా మనం మన పిల్లలకి కొనిచే ట్యాబు లు మొబైల్ ఫోన్ లు లేదా లాప్టాప్ లు ఈరోజు వారికీ సహాయం ఎంత చేస్తున్నాయో తెలియదు గని అంతే వారిని తప్పుదోవ పట్టిస్తున్నాయి అనడానికి ఈరోజు జరుగుతున్నా సైబర్ క్రైమ్ లే రుజువు.సోషల్ నెట్వర్కింగ్ చేయ్యనివారు ఉంటారా అని అనుకుంటున్నారేమో, మనకి మన పిల్లలు లేదా మనకి కావలసిన వారు ఎప్పుడు దోషులుగా కనిపించరు. కానీ ఒకసారి వారికీ ఇచే ముందు వారికీ దానికి సంబంధించిన మంచి చెడు స్పష్టం గా వివరించడం చాల అవసరం, తర్వాత కూడా వారు వాడుతున్నప్పుడు కూడా అది వారు ఎంత సేపు వాడుతున్నారు దానిపై వారి భావ ప్రకటన మరియు వారి ఆలోచన సరళి ఎలా మరుర్తున్నాయో వారిపై ఎలాంటి ప్రభావం ఉందొ ఇలాంటి విషయాలను జాగ్రతగా పరిశిలించి ఒక కంట కనిపెత్తవలిసిన బాధ్యత ఎంతైనా తల్లి దండ్రుల పై ఉన్ది.
ఇక పెద్దవారి విషయం తీసుకుంటే వారిపై కూడా ఈ నెట్వర్కింగ్ ప్రభావం ఎంతగానో ఉన్ది. దానిని ఎప్పటికప్పుడు స్వయం సమీక్ష చేసుకోవడం మన ఆలోచనలను మన అదుపు ఆజ్ఞ లలో ఉంచుకోవడం మన మనోబలం మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఎంత సమయం దీనికి కేటాయిస్తున్నాం దానివల్ల మన సమయం వృధా అవుతోందా లేదా మనకు ఉపయోగపడే సమాచారాన్ని ఏమైనా పొండుతున్నమ లేదా అనే అన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరు ఆలోచించవలిసి ఉన్ది.
సమాజానికి దీని ప్రభావం ఎలా ఉంటె మనకేంటి మనం బాగానే ఉన్నాం కదా అనే ధోరణి లో మనం పక్కన పెట్టేయ్యకుండా మనం కూడా ఈ సభ్య సమాజం లో భాగమే అనే విషయాన్నీ గుర్తించి మనకి ఉన్న బాధ్యతలని నిర్వర్తిస్తే మన సమయం సద్వినియోగం అవడమే కాకా మనకి తెలియకుండానే మనం సమాజ సేవ చేసిన వాళ్ళం అవుతాం. రేపు మన పిల్లలు మంచి సమాజం లో వారి జీవనాన్ని సాగించాలి అంటే దానికి పునాది మన చేతుల్లోనే ఉన్ది. దాని బాధ్యత అందరి పైన ఎంతైనా ఉన్ది.