ఎన్టీఆర్ పాదాల చెంతకే : మనోజ్

ఎన్టీఆర్ పాదాల చెంతకే : మనోజ్

‘మా నాన్నగారు 502 సినిమాలు చేసినా ఎప్పుడూ నందీ అవార్డు రాలేదు. నందమూరి తారక రామారావుగారికి కూడా రాలేదు. గొప్ప గొప్ప నటులకు రాని అవార్డు చిన్న వయసులో నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డును నేను తీసుకోవడం కళ్లారా చూడాలని మా అమ్మ నాతో వచ్చారు. ఈ అవార్డు అమ్మ చేతికి ఇస్తున్నాను. మా ఇంట్లో రామారావుగారి పెద్ద ఫోటో ఉంది. ఆ ఫోటో పాదాల చెంత ఈ అవార్డు పెట్టమని కోరాను'అని హీరో మంచు మనోజ్ అన్నారు. బిందాస్ చిత్రానికి గాను స్పెషల్ జ్యూరీ నంది అవార్డు అందుకున్న అతడు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఇతర భాషా చిత్రాలు ఇక్కడికి రాకూడదని కొంతమంది అంటున్నారు. నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. మన దగ్గర కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లి గెలిచే సత్తా ఉంది. ఆ దిశగా ప్రయత్నించాలికానీ...వారి అడ్డుకోవడం సరైంది కాదన్నాడు.

ప్రస్తుతం మంచు మనోజ్ ‘ఊకొడతారా ఉలిక్కి పడతారా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. మంచు లక్ష్మి ప్రసన్న నిర్మిస్తున్న ఈచిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది.