మోహన్ బాబుకే షాక్ ఇచ్చాడు

మోహన్ బాబుకే షాక్ ఇచ్చాడు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రీసెంట్ గా ట్విట్టర్ లో తనను షాక్ కు గురి చేసిన సంఘటన గురించి రాసుకొచ్చారు. ఆ ట్వీట్ లో...మా విద్యానికేతన్ లో ఐదో తరగతి చదివే పిల్లాడు ఒకడు నా దగ్గరకు వచ్చి షాక్ ఇచ్చాడు. వాడు నాతో మీ అబ్బాయి విష్ణుకి కథ తయారు చేసాను...నేరేట్ చేస్తాను వినండి అన్నాడు..నేను అది వినిషాక్ అయ్యాను. అలాగే మరొకడు కొన్ని పాటలు పాడి వినిపించాడు.. వాడి ధైర్యానికి,కాన్ఫిడెన్స్ కీ ఎమేజింగ్ గా అనిపించింది. ఈ జనరేషన్ స్పీచ్ లెస్ గా ఉంది అన్నారు. 

ఇక ప్రస్తుతం మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణు హీరోగా ఓ చిత్రం నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. జి నాగేశ్వరరెడ్డి దర్సకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని కోన వెంకట్,గోపీ మోహన్, బివియస్ రవి రచన చేసారు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందే ఆ చిత్రం ఢీ రేంజిలో ఉంటుందని, తిరిగి తన కెరీర్ పట్టాలు ఎక్కుతుందని మనోజ్ బావిస్తున్నారు. మోహన్ బాబు సైతం ఈ ప్రాజెక్టుపై చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. ఈ చిత్రంలో విష్ణు .. ఢీ తరహా ఎత్తులకు పై ఎత్తులు వేసే పాత్రను పోషిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.