తెలంగాణకు లాలూ ప్రసాద్ మద్దతు

 తెలంగాణకు లాలూ ప్రసాద్ మద్దతు

 తెలంగాణకు బీహార్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతు పలికారు. తెలంగాణపై వెంటనే తేల్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు సభలో తెలంగాణ బిల్లు వెంటనే పెట్టాలని నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను వాయిదా వేశారు. అనంతరం ఎంపీలు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. వారి వద్దకు భారతీయ జనతా పార్టీ అగ్రనేత రాజ్ నాథ్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లాలూ మాట్లాడారు.

కేంద్రం తెలంగాణ అంశాన్ని వెంటనే తేల్చాలాని ఆయన డిమాండ్ చేశారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. అలానే అభివృద్ధి సాధ్యమని రుజువైంది కూడా అని అన్నారు. తెలంగాణ విషయంలో ఇంకా ఆలస్యం చేయడం సరికాదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం అక్కడ ప్రజాస్వామ్యయుత పోరాటం నడుస్తుందని ఆయన చెప్పారు.