ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తానంటూ రామ్ చరణ్

ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తానంటూ రామ్ చరణ్

''బాద్‌షా' ప్రారంభోత్సవంలో నేనూ, ఎన్టీఆర్‌ ఒకే కారులో వెళ్లాం. ఇద్దరం ఒకే పరిశ్రమలో ఉంటున్నాం కదా. నా తోటి నటుడు, పైగా మంచి మిత్రుడు. తనతో కలిసి నటించడానికి నాకేం అభ్యంతరం లేదు. అయితే మంచి కథ రావాలి అన్నారు రామ్ చరణ్. ఈ రోజు (మంగళవారం) రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా మీడియాలో చరణ్ మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఇక తన తాజా చిత్రం రచ్చ గురించి చెపుతూ...‘చిరుత' వేరు.. ‘మగధీర' వేరు. 

ఈ రెండిటికంటే వైవిధ్యం ‘రచ్చ'లో చూస్తారు. ఈ సినిమాలో నేను కొత్తగా కనిపించడమే కాదు, చాలా అందంగా కూడా కనిపిస్తా.ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాదు... మాస్‌కు కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి అని చెప్పారు. ‘వానవాన వెల్లువాయె' పాటపై జరుగుతున్న వివాదం గురించి ఆయన మాట్లాడుతూ -‘‘ఆ పాటను దర్శకుడు అందంగా చిత్రీకరించాడు. అందులో అనుకున్నంత అసభ్యత ఏమీ లేదు'' అన్నారు. ‘రచ్చ' ఆల్బమ్‌లో నాకు నచ్చిన సాంగ్ ‘పిల్లా ఓ పిల్లా''' అని చెప్పారు.