'రచ్చ' హిందీ డబ్బింగ్ రైట్స్ అంతా?

'రచ్చ' హిందీ డబ్బింగ్ రైట్స్ అంతా?

రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ ప్రతీ విషయంలోనూ రికార్డులు క్రియోట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ ని కోటిన్నర వరకూ వెచ్చింది ఓ పెద్ద నిర్మాణ సంస్ధ తీసుకున్నట్లు సమాచారం. త్వరలో రామ్ చరణ్ హిందీ ఎంట్రీ ఇస్తున్న సందర్బంగా రచ్చ హిందీ వెర్షన్ కి క్రేజ్ ఏర్పడింది. ఇక అమితాబ్ సూపర్ హిట్ జంజీర్ తో రామ్ చరణ్ హిందీలో ప్రవేసించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. దాంతో గ్యారెంటీగా హిందీలో మంచి క్రేజ్ వస్తుంది. అందుకే ముందుగా ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ తీసుకుంటే అదను చూసి మార్కెట్లో విడుదల చేసి గడించవచ్చుననే ఆలోచనతో తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇక సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న రచ్చ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ బిజినెస్ మొత్తం పూర్తై పోయింది. అలాగే మార్చి 11 న ఈ చిత్రం ఆడియో పంక్షన్ చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఈ పంక్షన్ జరగనుంది. సినీ పరిశ్రమలోని అతిరధులు,రాజకీయనాయకులు హాజరయ్యే ఈ పంక్షన్ ఓ రేంజిలో జరగనుందని సమాచారం.