మోసపోయిన జర్నీ హీరోయిన్-పెళ్లి రద్దు!

మోసపోయిన జర్నీ హీరోయిన్-పెళ్లి రద్దు!

జర్నీ సినిమాలో తన క్యూట్ నటనతో అందరినీ ఆకట్టుకున్న హీరోయిన్ అనన్య....కొన్ని రోజుల క్రితం ఆంజనేయున్ అనే వ్యాపార వేత్తతో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆంజనేయన్ మోసగాడు అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆంజనేయన్‌కు ఇప్పటికే 2008లో పెళ్లయింది. తన మొదటి భార్యతో విడాకుల విషయంలో కోర్టులో కేసు పెండింగులో ఉంది. ఈ విషయాలను దాచి ఆంజనేయన్ అనన్యను, ఆమె కుటుంబ సభ్యులను మోసం చేసి పెళ్లికి ఒప్పించి, నిశ్చితార్థం కూడా పూర్తి చేసుకున్నాడు. 

తాము మోస పోయామన్న విషయం గ్రహించిన అనన్య కుటుంబ సభ్యలు పెరుంబవూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆంజనేయన్‌కు ఇప్పటికే పెళ్లయిన విషయాన్ని అటు పోలీసులు కూడా దృవీకరించారు. ఈ వ్యవహారంతో అనన్య కుటుంబ సభ్యులు నిశ్చితార్థం రద్దు చేసుకోవడంతో పాటు పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకోవాలనే ఆలోచనలో తెలుస్తోంది.