పీపుల్స్‌ ప్లాజాలో గోవుల ప్రదర్శన

పీపుల్స్‌ ప్లాజాలో గోవుల ప్రదర్శన

ప్రస్తుత స్పీడ్‌ యుగంలో ఆవుల గురించి అందరికీ తెలుసా ? చాలా మందికి తెలియదనే చెప్పాలి. అందుకే గోవులపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో గోవుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ గోమాతోత్సవం మూడు రోజుల పాటు కొనసాగనుంది.

దేశీయ ఆవు, వాటి పాల ప్రధాన్యతను తెలియజేయడానికి హైదరాబాద్‌ నెక్లస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో దేశీ కౌ ఉత్సవ్‌ పేరుతో గోమాత్సవం ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో 29 రకాల ఆవులు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో ఏడు రకాల జాతుల ఆవులను ఒకేచోట ఉంచి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు చరక డైరీ డైరెక్టర్‌ శాస్ట్రీ వెల్లడించారు.నిత్య జీవితంలో వస్తున్న ఎన్నో రకాల జబ్బులకు ఆవుపాలు, నెయ్యి, మూత్రం దివ్య ఔషధంగా పనిచేస్తాయని అవగాహన కల్పిస్తున్నారు. గో ఉత్పత్తులతో తయారైన పలు ఔషధాలను విక్రయిస్తున్నారు.

గో మాత విశిష్టతను నేటి తరానికి అందిస్తున్న నిర్వాహకులకు నగర వాసులు కృతజ్ఞతలు తెలిపారు. దేశీయ ఆవులు కనుమరుగవుతున్న నేటి తరంలో వాటిని ప్రదర్శించడం ఆనందంగా ఉందంటున్నారు. ఈ గోవుల ప్రదర్శన మూడు రోజులపాటు బుధ, గురు, శుక్రవారాల్లో కొనసాగనుంది.