చైనా మూలికల ఔషధంతో షుగర్ వ్యాధి నివారణ!

చైనా మూలికల ఔషధంతో షుగర్ వ్యాధి నివారణ!

చైనీయుల హెర్బల్ డికాషన్ ఇ-కి-జింగ్-మిన్-తంగ్, ఇన్సులిన్ ప్రభావం పెంచి డయాబెటీస్ తగ్గిస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ పరిశోధన వరల్డ్ జర్నల్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీలో ప్రచురించారు. మొదటిలో ప్రయోగాత్మకంగా పరిశోధకులు డయాబెటిక్ ఎలుకలపై ఈ హెర్బల్ మందును ప్రయోగించారు. ఈ మందు ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతోందని, అయితే అదే సమయంలో వీటిలో బరువును పెంచుతోందని వీరు తెలిపారు. 

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రచురించిన గణాంకాల మేరకు లక్షలాది అమెరికన్లు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నారని తెలుస్తోంది. 

20 ఏళ్ళు పైబడిన వారిలో షుమారు 35 శాతం మంది డయాబెటీస్ ప్రాధమిక దశలో వున్నారు. వీరిలో గ్లూకోజ్ స్ధాయి అధికంగా వుండి డయాబెటీస్ రోగానికి దగ్గరగా వుంది. బరువు తగ్గించుకుంటూ శారీరక శ్రమ అధికం చేసుకుంటే రక్తంలోని గ్లూకోజ్ స్ధాయి తగ్గుతుందని, బ్లడ్ షుగర్ మెటబాలిజం పెరిగి ఇన్సులిన్ సమర్ధత అధికమవుతుందని తెలిపారు.