మంచు విష్ణుతో చక్రి విభేదాలు

మంచు విష్ణుతో చక్రి విభేదాలు

నటుడు, నిర్మాత అయిన మంచు విష్ణు ప్రస్తుతం నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో దొరకడు అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరక్టర్ చక్రిని తీసుకున్నారు. అయితే అతని బద్దకం వల్ల ప్రాజెక్టు లేటవుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు విష్ణుకు చెందిన క్లోజ్ పర్శన్ మాట్లాడుతూ... చక్రి ట్యాలెంట్ ఉన్న మ్యాజిక్ డైరక్టర్.. కాదనేం. కానీ చాలా బద్దకస్తుడు. సెప్టెంబర్ 2011లో మా చిత్రానికి మ్యూజిక్ ఇవ్వటం మొదలెట్టాడు. ఇప్పటికీ పూర్తి చెయ్యలేదు. ఇప్పటికే కేవలం రెండు పాటలు మాత్రమే ఇచ్చాడు. మిగతా మూడు బ్యాలెన్స్ ఉన్నాయి. మేం ఆయన వల్ల డబ్బు, టైమ్ కోల్పోయాం. 

మేం వేరే కంపోజర్ ని వెతుక్కునే ఆలోచనలో ఉన్నాం అన్నారు. ఇక ఈ విషయాన్ని మీడియా వారు చక్రి వద్ద ఉంచగా.. ఆయన ఇవి రూమర్స్ అని కొట్టిపారేసారు. నేను ఇప్పటికీ మ్యూజిక్ డైరక్టర్ తో సిట్టింగ్స్ లో కూర్చుంటున్నాను. ఇది ఓ క్రియేటివ్ జాబ్. నాకు తృప్తి చెందనిదే నేను ట్యూన్ ఇవ్వలేను. దాంతో కొంత టైమ్ పట్టడం సహజం. నేనెప్పుడూ ఎవరి షూటింగ్ లు లేట్ లకు కారణం కాలేదు అన్నారు. గతంలోనూ పూరీ జగన్నాధ్... అతని బద్దకపు అలవాట్లుతో చక్రిని మార్చిన సంగతి తెలిసిందే.