నిర్మాత మోసం చేసాడని కంప్లైంట్

నిర్మాత మోసం చేసాడని కంప్లైంట్

తెలుగులో లవ్ జర్నీ పేరుతో డబ్బింగ్ అయ్యి విడుదల అవుతున్న తమిళ చిత్రం 'కనిమొళి'నిర్మాతపై తమిళ హాట్ ఐటం గర్ల్ సోనా కంప్లైంట్ చేసింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ...'కనిమొళి' నిర్మాత టి శివ తో కలిసి తాను ఆ చిత్రం నిర్మిం చానని, ఇప్పుడు తనకి మాట మాత్రం కూడా చెప్పకుండా, ఏమీ సంప్రదించకుండా తెలుగుకి డబ్బింగ్ రైట్స్ అమ్మారని ఆమె అంది. ఇది తనకు డబ్బుని ఎగ్గొట్టాలనే ఆలోచన మాత్రమే కాక, మోసం చేసినట్లు కూడా అని ఆరోపించింది. గతంలోనూ సోనా ..ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ పై లైంగిక వేధింపులు చేసాడంటూ కంప్లైంట్ చేసి వివాదం చేసిన సంగతి తెలిసిందే. 

అయితే ఆమె ఈ సినిమాలో పార్టనర్ అవటం మాత్రం నిజమేనని,ఎగ్రిమెంట్స్ కూడా ఉన్నాయని తమిళ సిని వర్గాలు అంటున్నాయి. ఇక జర్నీ ఫేమ్ జై హీరోగా, కలర్స్ స్వాతి, షాజన్ పదమ్‌సీ హీరోయిన్లుగా నటించిన 'లవ్ జర్నీ' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో వచ్చిన 'కనిమొళి' చిత్రానికి ఇది అనువాద రూపం. శ్రీపతి రంగస్వామి దర్శకుడు. స్ప్రింట్ టెలీఫిలిమ్స్ డైరెక్టర్ తిరుమలరెడ్డి సమర్పణలో జె.ఎన్.ఆర్. పవర్‌ఫుల్ మూవీస్ పతాకంపై జక్కుల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు.