నాగచైతన్య-సునీల్ మల్టీ స్టారర్ మూవీ?

నాగచైతన్య-సునీల్ మల్టీ స్టారర్ మూవీ?

అక్కినేని యువ హీరో నాగచైతన్య, హీరో సునీల్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ మూవీ రాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రానికి షూటింగ్ సమయం నుంచే మంచి స్పందన వస్తుండటంతో మరిన్ని ఇలాంటి సినిమాలకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల వరుసగా భారీ చిత్రాలు నిర్మిస్తూ దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ ప్రతిపాదన తెచ్చాడని, నాగచైతన్య, సునీల్ లతో ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని పెద్ద బడ్జెట్ తో నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సునీల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే, ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహించనున్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

'పూలరంగడు' చిత్రం విజయంతో సునీల్ స్టార్ ఇమేజ్ ఒక్క సారిగా పెరిగి పోయింది. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న యువ స్టార్ హీరోలకు పోటీ దారుగా మారతాడనడంలో ఎలాంటి సందేహం లేదని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం సునీల్ బాలీవుడ్‌లో మాధవన్, కంగనారనౌత్ జంటగా నటించిన ‘తను వెడ్స్ మను' చిత్రానికి రీమేక్ గా రూపొందున్న చిత్రంలో నటిస్తున్నాడు. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ‘సీతా వెడ్స్ రాముడు' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చిరంజీవీ చేతుల మీదుగా నిన్న ప్రారంభం అయింది.

మరో వైపు నాగచైతన్య ప్రస్తుతం దేవా కట్టా దర్వకత్వంలో ఆటో నగర్ సూర్య చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రంలో సమంత హీరోయిన్. దీని తర్వాత యూటీవీ సంస్థ నిర్మించే గౌరవం చిత్రానికి కమిట్ అయ్యాడు