గోపీచంద్‌తో నయనతార రొమాన్స్!

గోపీచంద్‌తో నయనతార రొమాన్స్!

గోపీచంద్ హీరోగా జై బాలాజీ మీడియా పతాకంపై ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని భూపతి పాండ్యన్ దర్శకత్వంలో తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పేరు పెట్టని ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నయతనతార రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారని, ఈ సినిమాలో నటించడానికి నయనతార గ్నీన్ సిగ్నల్ ఇచ్చిందని, అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేసిందని సమాచారం. 

ఈ చిత్రం గురించి గత కొన్ని రోజుల క్రితం నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ... అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా, గోపీచంద్‌కు సూట్ అయ్యే కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఇందులో గోపీచంద్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని ఆయన తెలిపారు. కోట శ్రీనివాసరావు, రఘుబాబు, షాయాజీషిండే, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: యం.రత్నం, కెమెరా: శక్తి శరవణన్, సమర్పణ: కొమర వెంక కథ-వూస్కీన్‌ప్లే-దర్శకత్వం: భూపతి పాండ్యన్.

మరో వైపు దగ్గుపాటి రానా సరసన 'కృష్ణం వందే జగద్గురుం'సినిమా కూడా నయన ఓకే చెప్పింది. గతంలో వెంకటేష్ సరసన తులసి, లక్ష్మి చిత్రాలలో చేసిన ఆమె ఆయన అన్న కుమారుడు రానా సరసన కూడా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.