svmc-ప్రకాష్ రాజ్ వెనక్కి

svmc-ప్రకాష్ రాజ్ వెనక్కి

విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ చిత్రంలో ఈ ఇద్దరు హీరోలకు తండ్రి పాత్రకు ఎంపికైన ప్రకాష్ రాజ్ నిర్మాత దిల్ రాజుతో విబేధాలు వచ్చి సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రకాష్ రాజ్ తన నిర్ణయం మార్చుకున్నాడని, తిరిగి షూటింగులో జాయిన్ అయ్యాడని తెలుస్తోంది.

దిల్ రాజు-ప్రకాష్ రాజ్ మధ్య మనస్పర్థల నేపథ్యంలో మహేష్ బాబు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చాడని, ఇద్దరు కాంప్రమైజ్ అయి మళ్లీ స్నేహితులయ్యారని సినీ వర్గాల సమాచారం. మహేష్ బాబు ఇంత చొరవ తీసుకోవడం వెనక బలమైన కారణమే ఉంది. మహేష్ బాబుకు ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ బాగా ఇష్టం. అందుకే తన ప్రతి చిత్రంలోనూ అతనికి తప్పకుండా స్థానం ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక్కడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మేన్ లాంటి భారీ విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. అదే సెంటిమెంటుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోనూ ప్రకాష్ రాజ్‌ను ఎంపిక చేశారు. హాఠాత్తుగా ప్రకాష్ రాజ్ బయటకు వెళ్లి పోవడంతో షాకైన మహేష్ బాబు అతన్ని తిరిగి రప్పించడంలో సక్సెస్ అయ్యాడు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ప్రస్తుతం హైదాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి హీరోయిన్లుగా ఎంపికయ్యారు.