చెర్రీతో రొమాన్స్‌కు ఆమెకు రూ.11కోట్ల ఆఫర్!

చెర్రీతో రొమాన్స్‌కు ఆమెకు రూ.11కోట్ల ఆఫర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో ‘జంజీర్' అనే బాలీవుడ్ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను చరణ్ సరసన ఎంపిక చేశారని, ఇందు కోసం ఆమెకు రూ. 11 కోట్ల వరకు ఆఫర్ చేశారనే వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. చరణ్ ఫికిక్, ఆటిడ్యూడ్‌కి ఆవిడ అయితేనే పర్‌ఫెక్టుగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఆమెను ఒప్పించడానికి ఇంత పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేశారట నిర్మాతలు. 

1973లో వచ్చిన బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ సూపర్ హిట్ మూమీ ‘జంజీర్' చిత్రాన్నే మళ్లీ చరణ్ హీరోగా అదే టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం 2013 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. హిందీతో పాటు తెలుగులోనూ ఒకే సారి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అపూర్వ లఖియ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ప్రస్తుతం చరణ్ ‘రచ్చ' చిత్రంలో నటిస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో తమన్నా హీరోయిన్. మెగా సూపర్ గుడ్ మూవీస్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.