రూమర్స్ ని కొట్టిపారేసిన 'రచ్చ'నిర్మాత

రూమర్స్ ని కొట్టిపారేసిన 'రచ్చ'నిర్మాత

రామ్ చరణ్ రచ్చ చిత్రం విడుదలపై రకరకాల రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రామ్ చరణ్ కి షూటింగ్ లో దెబ్బ తగలటంతో పాట బ్యాలెన్స్ ఉండిపోయిందని,ఆ పాట పూర్తవటానికి నెల దాకా పడుతుందని చెప్పారు. దాంతో ఈ చిత్రం రిలీజ్ బాగా లేటవుతుందని,మే నెలాఖరు వరకూ పొడిగించబడుతుంటూ వినపడ్డాయి. అయితే వీటినన్నటినీ నిర్మాత ఎన్.వి ప్రసాద్ కొట్టి పారేస్తూ తమ సినిమా ముందు అనుకున్నట్లుగానే ఏప్రియల్ మొదటి వారంలోనే విడుదల అవుతుందని చెప్పారు. దాంతో దర్సకుడు ఈ అఫీషియల్ ప్రకటనతో ఊపిరిపీల్చుకున్నట్లయింది. అలాగే ఇఫ్పటికే మణిశర్మ అందించిన పాటలు మంచి హిట్ అయ్యాయని,ఎక్సపెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని,వాటని గ్యారెంటీగా రీచ్ అవుతామని చెప్పారు. ప్రస్తుతం డబ్బింగ్,షూటింగ్ ఫినిష్ అయ్యి,డిటిఎస్ మిక్సింగ్ లో ఉన్నామని చెప్పారు. మరికొద్ది రోజుల్లోనే పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తవుతుందని చెప్పారు. ఈ చిత్రం మాస్ కి పండగ లాంటిదని చెప్పుకొచ్చారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ మెడికోగా కనిపించనున్నారు.