పెంచిన రైలు ఛార్జీల ఉపసంహరణ

పెంచిన రైలు ఛార్జీల ఉపసంహరణ

 తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పంతం నెగ్గించుకున్నారు. రైలు ఛార్జీలు పెంచిన దినేష్ త్రివేదితో రాజీనామా చేయించిన ఆమె.... కొత్త మంత్రి ముకుల్ రాయ్తో ఛార్జీల పెంపును ఉపసంహరిస్తున్నట్లు ప్రకటన చేయించారు. సాధారణ నుంచి ఏసీ త్రీటైర్ ఛార్జీలు గతంలో ఉన్న మాదిరిగానే ఉంటాఇయని రైల్వే మంత్రి గురువారం లోక్సభలో ప్రకటించారు. పేద, మధ్యతరగతి ప్రయాణికుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్కు పెంచిన ఛార్జీలలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు.