సునీల్ ఉద్దేశించి రాజమౌళి ట్వీట్

సునీల్  ఉద్దేశించి రాజమౌళి ట్వీట్

స్టార్ డైరక్టర్ రాజమౌళి తన పాజిటివ్ ఏటిట్యూడ్ తో ఇండస్ట్రీతో సరైన సంభందాలు మెయింటైన్ చేస్తూంటారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో నితిన్, సునీల్ చిత్రాల గురించి ట్వీట్ చేసి ప్రశంసలు చేసారు. ఆ ట్వీట్ లో... పూల రంగడు, ఇష్క్.. రెండు చిత్రాలు చూసాను. ఎక్సట్రార్డనరీ అని చేప్పను గానీ... డబ్బుకీ, టైమ్ కీ డెఫినెట్ గా న్యాయం చేసే సినిమాలు అని చెప్తాను. రెండు సినిమాలను బాగా ఎంజాయ్ చేసాను. పూల రంగడులో హైలెట్ సునీల్ సిక్స్ ప్యాక్. ఫెరఫెక్ట్ గా ఉంది. 

సిక్స్ ప్యాక్ ఫెరఫెక్ట్ గా రావటం కోసం ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడా అనిపించింది. కంగ్రాట్స్ సునీల్ గారు.. పి.సి శ్రీరామ్ గారూ... ఒక్క సెకను కూడా ప్రేక్షకుల దృష్టిని ప్రక్కకు తిప్పుకోనివ్వనంతగా లీనమయ్యేలా చేసే ఛాయగ్రాయకుడు శ్రీరామ్ గారూ.. ఆయనకి హ్యాట్సాఫ్. ఇక నిత్యా మీనన్ ఫెరఫార్మెన్స్ చూస్తే ముచ్చటేసింది. చాలా న్యాచురల్ గా ఉంది. నితిన్ కి కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేసి అందరినీ ఆనందపరిచారు.