షారుఖ్, అతని పిల్లలను అవమానించిన వర్మ

షారుఖ్, అతని పిల్లలను అవమానించిన వర్మ

బాలీవుడ్ డేరింగ్ దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. అతని సినిమాలు వివాదాస్పందంగా ఉన్నట్లే అతని వ్యాఖ్యలు కూడా ఒక్కోసారి వివాదాలకు దారి తీస్తాయి. తన తోటి నటులను బూతు పదజాలంతో దూషించడం కూడా వర్మకే చెల్లింది. అప్పట్లో అమితాబ్‌పై వర్మ తన ట్విట్టర్లో బండబూతులు తిట్టాడు. వర్మ తాగిన మత్తులో ఆ వ్యాఖ్యలు చేశాడని, ఇద్దరు మంచి మిత్రులే కావడంతో అమితాబ్ కూడా అతని వ్యాఖ్యలను లైట్ తీసుకున్నాడనే వార్తలు వినిపించాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ను టార్గెట్ చేశాడు.

"Missing my lil boy and girl....they have such small lovely hands....and such large beautiful hearts (sic)." అంటూ షారుఖ్ తన ట్విట్టర్లో పేర్కొనగా..... "If all children are so innocent nd have beautiful hearts how come most of them grow up to become bastards?" అంటూ పరోక్షంగా షారుఖ్‌ను ఉద్దేశిస్తూ ప్రతివ్యాఖ్యలు చేశాడు వర్మ. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా వర్మ షారుఖ్, అతని పిల్లలను అవమారించారని షారుఖ్ అభిమానులు మండి పడుతున్నారు. 

షారుఖ్ ఖాన్‌కు అతని పిల్లలు ఆర్యన్, సుహానా అంటే చాలా ఇష్టం. తను ఎంత బిజీగా ఉన్నా... పిల్లల కోసం ప్రత్యేకంగా కొంత టైం కేటాయిస్తాడు. తన కూతురు కోసం ఆ మధ్య రోడ్డుపై సైకిల్ కూడా తొక్కాడు. షారుఖ్‌కు అసలే కోపం ఎక్కువ. అవసరం అయితే నాలుగు తగిలించే రకం. మరి వర్మ వ్యాఖ్యలపై ఈ హీరో ఎలా స్పందిస్తాడో చూడాలి.