15 లక్షల కమెడియన్...ఇప్పడు 3 కోట్ల హీరో!

15 లక్షల కమెడియన్...ఇప్పడు 3 కోట్ల హీరో!

ఒక సాధారణ కమెడియన్‌గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్ ప్రస్తుతం హీరోగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. కమెడియన్ నుంచి స్టార్ కమెడియన్‌గా ఎదగడం ఒక ఎత్తయితే...తన కామెడీ పర్సనాలిటీనా కండలు తిరిగిన హీరో పర్సనాలిటీగా మలుచుకోవడం మరో ఎత్తు. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం సునీల్ స్టార్ కమెడియన్‌గా రాణిస్తున్న కాలంలో సినిమాకు రూ. 15 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వాడని, అందాల రాముడు, మర్యాద రామన్న సినిమాల ద్వారా హీరోగా టర్న్ అయ్యాక ‘పూల రంగడు' చిత్రానికి రూ. 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసకున్నాడని చర్చించుకుంటున్నారు. 

తాజాగా విడుదలైన సునీల్ పూల రంగడు....రవితేజ ‘నిప్పు' సినిమాను సైతం వెనక్కి తోసి హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో సునీల్ కెరీర్‌కు ఇక తిరుగుండదనే అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తే సునీల్ రెమ్యూనరేషన్ మరింత పెరిగినా ఆశ్చర్యపడనక్కర్లేదని సినిమా ట్రేడ్ వర్గాలంటున్నాయి. 

అకుంటిత దీక్ష, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగల అనడానికి హీరో సునీల్ నిదర్శనం. 108 కేజీల బరువుండే ఈ యాక్టర్ మజిల్స్ బాడీ బిల్డ్ చేయడానికి మూడేళ్ల పాటు ఎన్నో కష్టాలకు ఓర్చాడంటే అర్థం చేసుకోవచ్చు అతని కమిట్ మెంట్ ఏ రేంజ్ లో ఉందో...