యంగ్ హీరో ఆస్దులు అమ్మకం

 యంగ్ హీరో ఆస్దులు అమ్మకం

పందెం కోడి ఫేమ్ విశాల్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి ఆస్దులు అమ్ముకుంటున్నట్లుగా చెన్నై ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది. తమ జి.కె ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ పై తమ సోదరుడు విక్రమ్ కృష్ణ నిర్మాతగా తను హీరోగా చేస్తున్న వరస సినిమాలు డిజాస్టర్ కావటంతో ఈ పరిస్దతి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. తమిళ,తెలుగులో మార్కెట్ ఉన్నప్పటికీ తమ మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టడం,స్టార్ డైరక్టర్స్ తో చేయకపోవటం,డైరక్షన్ లో విశాల్ వేలు పెట్టడం వంటి వాటితో అప్పులు పాలయ్యే స్ధితి వచ్చిందని చెప్తున్నారు. మరో ప్రక్క రాడాన్ ప్రొడక్షన్స్ రాధిక..విశాల్ పై అశోశియేషన్ లో కంప్లైట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెకు తొమ్మిది కోట్లు రూపాయలు బాకీ ఉన్నాడని ఆ కంప్లైంట్ సారాంశం. దాంతో అన్నానగర్ లోని విశాల్ ఇంటిని అమ్మేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఈ విషయమై విశాల్ ని మీడియా వారు ప్రశ్నించినప్పుడు..తనకు హైదరాబాద్ లో కానీ చెన్నైలో కానీ ఆస్దులు ఏమీ లేవని,అలాంటప్పుడు అమ్మే ప్రసక్తి ఎక్కుడుందని ఎదురు ప్రశ్నించాడు. ఆయన తండ్రి పేరు మీద ఉన్న ఆస్దులను ఫైనాన్సియల్ ఎడ్జెస్ట్మెంట్ కోసం అమ్ముతున్నట్లుగా చెప్తున్నారు. మరో ప్రక్క విశాల్ తెలుగు చిత్రం కిలాడి పెద్ద ప్లాప్ గా నమోదైంది.