వేలు పెట్టాడనే సిద్దార్దని తప్పించారా?

 వేలు పెట్టాడనే సిద్దార్దని తప్పించారా?

హీరో సిద్దార్థ ‘సుకుమారుడు' అనే చిత్రానికి కమిట్ అయ్యాడు. అయితే అఆ తర్వాత చేయటం లేదంటూ వార్తలు వచ్చాయి. డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటం వల్లనే సిద్దార్ద ఆ ప్రాజెక్టుని వదులుకున్నాడని చెప్తున్నారు. అయితే అసలు నిజం మరొకటి ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసుకురమ్మని దర్సకుడుకి సిద్దార్ద పురమాయిస్తే అతను హీరోనే మార్చేసాడని చెప్పుకుంటున్నారు. అందులోనూ వరస ప్లాపుల్లో ఉన్ సిద్దార్ద తాజా చిత్రం లవ్ ఫెయిల్యూర్ చిత్రం కూడా అంతంత మాత్రంగా ఆడటం కూడా దర్శక, నిర్మాతలకు ఆసక్తి లేకపోయింది. సిద్దార్ద ప్రతీ విషయంలోనూ వేలు పెడతాడన ఇలాంటి స్టేజిలో అతని కన్నా యంగ్ హీరోతో ముందుకెళ్ళటం బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చే ఆదిని సంప్రదించాడని చెప్పుకుంటున్నారు. ఇక 

పిల్ల జమీందార్ చిత్రంతో హిట్ కొట్టిన అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో ఎప్పుడో వెంకటేష్ తో సుందరాకాండ తీసిన కెవివి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించటానికి ముందుకు వచ్చారు. ఇప్పుడా స్క్రిప్టుని ఆదికి అణుగుణంగా మారుస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఆది వేగంగా దూసుకుపోతున్నారు. చాలా మంది యువదర్శకులు అతని కోసం కథలు వంటకం చేసుకుని తిరుగుతున్నారు. ఈ ట్విస్టు ఊహించని సిద్దార్ధ ఇప్పుడు తన చేతిలో ఉన్న నందినీ రెడ్డి సినిమాపై దృష్టి పెట్టారు. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. అలా మొదలైంది చిత్రం లాగానే ఇది కూడా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.