రచ్చ ఫోర్‌డేస్ కలెక్షన్స్ రూ.30.2 కోట్లు

రచ్చ ఫోర్‌డేస్ కలెక్షన్స్ రూ.30.2 కోట్లు

యువ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, తమన్నా జంటగా నటించిన చిత్రం "రచ్చ". ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 30.2 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ఈ చిత్ర వర్గాలు చెపుతున్నాయి. ఇందులో గ్రాస్ కలెక్షన్లు, షేర్లు సుమారుగా 20 కోట్ల రూపాయలకుపైగా ఉన్నాయట. 

కాగా, ఈ చిత్రం తమిళ, మలయాళ అనువాద చిత్రాలు శుక్రవారం విడుదలకానున్నాయి. తమిళంలో 'రగలై' పేరుతోనూ, మలయాళంలో 'రక్ష' పేరుతో విడుదల కానుంది. ఈ రెండు భాషల్లో కూడా మంచి కలెక్షన్లు వసూలు చేస్తే సరికొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయమని చిత్ర పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చిత్రం తొలి రోజు షేర్ కలెక్షన్లు రూ.8.54 కోట్లు కాగా, మొదటి రెండు రోజుల్లో 12.9 కోట్ల రూపాయలుగా ఉన్నది. ఈ చిత్రం మొత్తం రికార్డు స్థాయిలో 1585 థియేటర్లలో విడుదలైంది. 

ఇదిలావుండగా, "రచ్చ" చిత్రంలో ప్రస్తుతం ఐదు పాటలు మాత్రమే ఉన్నాయి. తాజాగా మరో పాటను జత చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. గత యేడాది ఇదే నిర్మాత రామ్ చరణ్‌తో "మెరుపు" చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు. 

ఇందుకోసం ఓ పాటను కూడా షూట్ చేశారు. ప్రస్తుతం ఈ పాటనే రచ్చ చిత్రంలో జత చేయాలని నిర్ణయించారు. అయితే, రామ్ చరణ్ మాత్రం.. తన తాజా చిత్రం "ఎవడు"లో ఈ పాటను వాడాలని భావిస్తున్నాడు.