రామ్ చరణ్ 'రచ్చ' టాక్ ఏంటి?

రామ్ చరణ్ 'రచ్చ' టాక్ ఏంటి?

రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ ఈ రోజు అంతటా భారీగా విడుదల అయ్యింది. కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ,దుబాయి,అమెరికా వంటి చోట్ల అప్పుడే షోలు పడిపోయాయి. అక్కడ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం పూర్తి స్దాయి మాస్ సినిమా అని..రామ్ చరణ్ అభిమానులనే కాక మాస్ సినిమాలను అభిమానించే అందరినీ అలరిస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్టు కు ప్రేక్షకులు బాగా సర్ప్రైజ్ అవుతున్నారు. అలాగే సినిమాకు పాటలు,డైలాగులు యూ.ఎస్.పి గా మారుతున్నాయని చెప్తున్నారు.

ఆరెంజ్ వంటి ప్లాప్ తర్వాత వచ్చిన ఈ చిత్రంపై మెగా క్యాంప్ కి చాలా అంచనాలు ఉన్నాయి. పొరపాటున కూడా ఆరెంజ్ తరహాలో మల్టిప్లెక్స్ సినిమా కాకూడదని అన్ని జాగ్రత్తలూ తీసుకుని చేసారు. ముఖ్యంగా చిరంజీవి కొడుకు కావటంతో ఆయన అభిమానులు చాలా మంది రామ్ చరణ్ అభిమానులు ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే చాలా చోట్ల చిరంజీవిని గుర్తు చేసేలా చేసారు. హీరోయిన్ కోసం రామ్ చరణ్ మెడికల్ కాలేజికి వెళ్లేటప్పుడు శంకర్ దాదా ఎమ్.బి.బిస్ ని గుర్తు చేస్తూ స్టైల్ మెయింటైన్ చేసారు. 

ఇక పాటల్లో కూడా వానా వానా వెల్లువాయే పాట పెట్టడం,రచ్చ టైటిల్ సాంగ్ లో కొన్ని స్టెప్ లలో చిరంజీవిని గుర్తు చేయటంతో ఫ్యాన్స్ కి భీభత్సంగా నచ్చుతోంది అంటున్నారు. ఇక రెగ్యులర్ గా కామెడీ కోసం సినిమాకు వెళ్లే జనాలు కోసం బ్రహ్మానందం,అలీ,ఎమ్ ఎస్ నారాయణ, వేణు మాధవ్ వంటి స్టార్ కమిడెయిన్స్ ని తీసుకున్నారు. ఫస్టాఫ్ లో వచ్చే రంగీలా ఫ్రమ్ అమెరికా అంటూ బ్రహ్మానంద చేసే కామెడీ చాలా నైస్ గా ఉందని రిపోర్టులు వస్తున్నాయి.


కథ కొత్తగా లేకపోయినా,ఘరానా మొగుడు,గ్యాంగ్ లీడర్ తరహాలో ఉన్నా కథనం పరుగులెత్తించటం సినిమాకు ప్లస్ అయ్యిందని చెప్తున్నారు. అలాగే పరుచూరి బ్రదర్స్ పంచ్ తో కరెక్టు గా మాస్ తగిలేటట్లు రాసిన డైలాగులు కి విజిల్స్ పడుతున్నాయి. ఇక యూనివర్శిల్ అప్పీల్ అయిన తండ్రి సెంటిమెంట్,తన విలేజ్ కోసం పాటుపడటం,తండ్రి కోరికను నెరవేర్చటం వంటివి సినిమాకు వెన్నుముకలా నిలిపాయి. 

అలాగే'రచ్చ'కథపరంగా మహాద్భుతం కాకపోయినా మంచి స్క్రీన్‌ప్లే ఉంటుంది. ప్రతి 15 నిమిషాలకు ఆసక్తికరమైన విషయాలుంటాయి. రచ్చ అంటే సెలబ్రేషన్. హీరో ఏ పని చేసినా ఒక మూడ్‌తో, పాజిటివ్ ఎనర్జీతో చేస్తాడు. అందుకే ఆ టైటిల్‌ను రామ్‌చరణ్ పేరు నుంచే సెలక్ట్ చేసి పెట్టారు. ఈ చిత్రంలో చరణ్ అందంగా, మాన్లీగా కనిపిస్తున్నాడని అంటున్నారు. టోటల్ గా ఓ పక్కా మాస్ ఎంటర్టైనర్ చూసిన ఫీల్ కలిగింది అంటున్నారు.