రామ్ చరణ్ రెమ్యునేషన్ 12 కోట్లు??

రామ్ చరణ్ రెమ్యునేషన్ 12 కోట్లు??

రామ్ చరణ్ తన తాజా చిత్రం కి రెమ్యునేషన్ 12 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడంటూ బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. జంజీర్ రీమేక్ చేస్తూండటంతో బాలీవుడ్ లో రామ్ చరణ్ హాట్ టాపిక్ గా మారారు. ఈ చిత్రంలో చేయటానికి ప్రియాంక చోప్రా 9 కోట్లు తీసుకుంటున్నప్పుడు.. హీరోగా చేసే రామ్ చరణ్ అంతకన్నా ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటాడని సమర్ధించింది. అంతేగాక రామ్ చరణ్ ఆల్రెడీ ఆంద్రప్రదేశ్ లో పదికోట్ల రూపాయల రెమ్యునేషన్ తీసుకుంటున్నాడని,బాలీవుడ్ లో ఎంట్రీ కాబట్టి 12 కోట్లు కి సైన్ చేసాడని,బాలీవుడ్ బడ్జెట్ లతో పోలీస్తే అది పెద్దమొత్తమేమీ కాదని తేల్చింది. రామ్ చరణ్ మాత్రం కూల్ గా ఈ విషయమై ని మీడియాతో... మా మేనేజర్ ఈ విషయాల్ని చూసుకుంటారు. నేను ఇలాంటి విషయాలను ఓపెన్ గా చర్చించలేను అన్నారు.

ఇక రామ్ చరణ్ చేసినవి నాలుగు చిత్రాలే అయినా అతను ఆరు కోట్ల రెమ్యునేషన్ తీసుకునే స్ధాయికి ఎదిగాడని మన టాలీవుడ్ లో వినపడుతోంది. అతని తాజా చిత్రం రచ్చ కోసం రామ్ చరణ్ ఈ మెత్తం వసూలు చేసినట్లు చెప్తున్నారు. ఇక మొదటి చిత్రం చిరుతకి సైతం రెండు కోట్లు, అలాగే మగధీర నిమిత్తం నాలుగు కోట్లు, ఆరెంజ్ కి ఐదు కోట్లు వసూలు చేసాడని, అవన్నీ తమ సొంత బ్యానర్స్ అయినా తన డిమాండ్, క్రేజ్ పెంచుకోవటానికి తీసుకున్నాడని, దాంతో రచ్చ వద్దకు వచ్చేసరికి ఆరు కోట్లు డిమాండ్ చేసాడని చెప్తున్నారు. ఇక ఇలా తీసుకున్న డబ్బులతో గతంలో తన తండ్రి పుట్టిన రోజు గిప్ట్ గా నాలుగు కోట్లు ఖర్చు పెట్టి రోల్స్ రాయిస్ కారుని తీసుకున్నాడు. ఇక మిగతా డబ్బులను తన తండ్రితో తాను నిర్మాతగా తీయబోయే చిత్రానికి ఖర్చుపెడతాడు.

ఇక జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్ ..విజయ్ గా కనిపించనున్నాడు..మాలా గా ప్రియాంక చోప్రా,తేజ గా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. ఇక షేర్ ఖాన్ పాత్రలో అర్జున్ రాంపాల్,మోనా గా మహీ గిల్ కనిపించి అలరించనున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.

ఈ చిత్రంలో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ మెహ్రా నిర్మాత. ఈ రీమేక్‌లో అమితాబ్‌ అతిథి పాత్రలో కనపడటానికి అమితాబ్ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్‌ సమాచారం. ఈ విషయమై దర్శకుడు అపూర్వ లఖియా ని మీడియా సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ ''అమితాబ్‌ మా సినిమాలో నటిస్తున్నారని ఇంకా అధికారికంగా చెప్పలేను. ఆయన్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే. బిగ్‌ బి ఆశీస్సులు లేకుండా ఈ సినిమాను తీయలేం'' అన్నారు.