నకిలీ బంగారంతో బ్యాంకుకు రూ.2.30 కోట్లు టోకరా

నకిలీ బంగారంతో బ్యాంకుకు రూ.2.30 కోట్లు టోకరా

 రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గురువారం ఓ ఘరానా మోసం బయటపడింది. నకిలీ బంగారంతో ఏకంగా ఓ బ్యాంక్‌నే బురిడీ కొట్టించిన సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు నకిలీ బంగారాన్ని నేరెడ్‌మెట్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తాకట్టు పెట్టి రూ.2.30 కోట్లు తీసుకున్నారు. అది నకిలీ బంగారం అని తెలుసుకున్న బ్యాంకు అధికారులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నకిలీ బంగారం తాకట్టు పెట్టిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.