సమంత, కాజల్, తమన్నా రెమ్యునేషన్స్

సమంత, కాజల్, తమన్నా రెమ్యునేషన్స్

ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ రెమ్యునేషన్స్ .. హీరోలతో పోటి పడుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ రెమ్యునేషన్స్ వింటే పెద్ద నిర్మాతలు సైతం ఖంగుతింటున్నారు. మొదటి సినిమా హిట్టవగానే రెండో సినిమాకే స్టార్ హోదా వచ్చినట్లుగా ఫీలై విపరీతమైన రేట్లు చెప్తున్నారని గోలెత్తుతున్నారు. ముఖ్యంతా తెలుగు హీరోయిన్స్ లో నయనతార, కాజల్‌, తమన్నా ల చెప్పే రేట్స్ అయితే అందరినీ షాక్ ఇస్తున్నాయి. అలాగని వారు డేట్స్ ఈజీగా దొరకటం లేదు. అంత రెమ్యునేషన్ ఇచ్చుకున్నా సినిమా ఒప్పుకునే ముందు రకరకాల కండీషన్స్ పెడుతున్నారు. వారి రెమ్యునేషన్ లో పాపులర్ మీడియాలో చెబుతున్నదాన్ని బట్టి...

నయన తార ప్రస్తుతం ఒక చిత్రానికి రూ.1.15 కోట్లు తీసుకొంటోందని తెలిసింది. అదే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చేయాల్సి వస్తే రూ.1.50 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు కోలీవుడ్‌ సమాచారం. ప్రస్తుతం నయనతార చేతిలో చేతిలో మూడు తెలుగు చిత్రాలున్నాయి. నయనతార 'శ్రీరామరాజ్యం'లో సీతాదేవిగా మెప్పించింది. ఆ తరవాత సినిమాలకు స్వస్తి చెప్పేస్తుందన్నారు. తెలుగు, తమిళ దర్శకులు సంప్రదించినా నటించేందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు మనసు మార్చుకొంది... డిమాండ్‌ పెరిగింది. 

ఇక కాజల్ విషయానికి వస్తే ఆ మధ్య వరస ప్లాప్ లతో కాస్త వెనక పడ్డా...మహేష్ బాబు'బిజినెస్‌మేన్‌'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది‌. దాంతో ఆమె కూడా డిమాండ్ చేసి మరీ రెమ్యునేషన్ వసూలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె పారితోషికం కోటి రూపాయలు. ఇంత రెమ్యునేషన్ పెంచినా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అయిదు చిత్రాలు చేస్తోంది. కాజల్ ఉంటే తెలుగు,తమిళ భాషల్లో ఉండే డిమాండే వేరు అంటున్నారు.

అలాగే కాజల్ కి సమీపంలో పోటీ ఇస్తున్న మరో తార తమన్నా. ఆమె కూడా అదే కోటి రేటు కి ఫిక్స్ అయ్యింది. హండ్రెడ్ పర్శంట్ లవ్,రచ్చ చిత్రాలు హిట్టవటం ఆమెకు కలిసివచ్చింది. దాంతో ఆమె వరసగా మూడు సినిమాలు చేస్తోంది. ఆమె సినిమాలు యూత్ కి బాగా పడుతూంటడంతో ఎంత రెమ్యునేషన్ అయినా ఇవ్వటానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. పెద్ద హీరోలు ఆమెను తన ప్రక్కన చేయించుకోవాలని ఆరాట పడుతున్నారు.

సమంత విషయానికి వస్తే...ఆమెకు ఉన్న డిమాండ్ చెప్పనవసరం లేదు. రూ.75 లక్షలు నుంచి రూ.80 లక్షల వరకూ డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. అదీ దూకుడు హిట్టైన తర్వాత ఆమె రెమ్యునేషన్ పెంచింది. వరుసగా మూడు విజయాలు దక్కించుకొన్న ఈ చెన్నై చిన్నది తమ సినిమాల్లో ఉంటే లక్కిగా భావిస్తున్నారు నిర్మాతలు. త్వరలో ఆమె నటించిన 'ఈగ' విడుదల కాబోతోంది. 

ఇక త్రిష ప్రస్తుతం రూ.80 లక్షల వరకూ తీసుకొంటోంది. 'దమ్ము'రిజల్ట్ తరవాత ఆమె తన రెమ్యునేషన్ పారితోషికం పెంచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బాడీగార్డు సరిగా ఆడకపోవటం,తనకు తెలుగు,తమిళంలో డిమాండ్ తగ్గటంతో త్రిష ...మొదటి ప్రాజెక్టు ఓకే చేసుకోవటం పైనే దృష్టి పెడుతోంది. ఇక గబ్బర్ సింగ్ లో చేస్తున్న శ్రుతి హాసన్ కి ఇప్పటివరకూ ఒక్క హిట్టూ లేకపోయినా ఒక్కొక్క సినిమాకిగానూ రూ.50 నుంచి 60 లక్షలు డిమాండ్‌ చేస్తోందని సమాచారం.