తెరపై దివ్యభారతి జీవితం

తెరపై దివ్యభారతి జీవితం

సినిమా పరిశ్రమ నేపథ్యంలో కథలు అల్లుకొనే సంస్కృతి మొదలైంది. బాలీవుడ్‌లో సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ది డర్టీ పిక్చర్‌' బాక్సాఫీసు వద్ద విజయం సాధించడంతో ఆ తరహా కథపై దర్శకులు దృష్టిపెట్టారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దివ్యభారతి జీవితం సినిమాగా రాబోతోంది. 1993 ఏప్రిల్‌ 5న మేడపై నుంచి పడి చనిపోయింది దివ్యభారతి. ఆ మరణం ఇప్పటికీ మిస్టరీనే! చిన్న వయసులోనే తారగా వెలుగొందిన ఆమె కేవలం 13 చిత్రాలు మాత్రమే చేసింది. తెలుగులో బొబ్బిలి రాజా, అసెంబ్లీరౌడీ, ధర్మక్షేత్రం లాంటి చిత్రాల్లో నటించింది. దివ్యభారతి చిత్రాన్ని విక్రమ్‌ సంధు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తారు. ఆయన గతంలో షాహీద్‌ భగత్‌సింగ్‌ అనే చిత్రాన్ని రూపొందించారు. సంధు మాట్లాడుతూ ''ఓ పల్లెటూరి నుంచి వచ్చి అతి తక్కువ కాలంలోనే అగ్ర నాయికగా ఎదిగిన ఓ యువతి కథ ఇది. వాస్తవ సంఘటనలకు దగ్గరగా ఉంటుంద''న్నారు.