మగ పిల్లాడి కోసం భార్యకు వేధింపులు

మగ పిల్లాడి కోసం భార్యకు వేధింపులు

ఏడో కాన్పులో మగపిల్లాడు పుడతాడని ఓ బాబా చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తి.. భార్యకు నరకం చూపించాడు. గుంటూరు జిల్లాకు చెందిన అల్లాభక్షి-మున్నీలకు ఏడేళ్ల కిందట వివాహం అయింది. మొదటి రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టడంతో అసహానానికి గురైన అల్లాబక్షి.. తర్వాత వరుసగా అబార్షన్లు చేయించాడు. 

ఆరోసారి కూడా ఆడపిల్లే పుడుతుందని తెలియడంతో... బలవంతంగా అబార్షన్ చేయించబోయాడు. మున్నీ ఎదురు తిరగడంతో.. కడుపుపై రాడ్‌తో తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. అబార్షన్ చేసి శిశువును తీసేసిన డాక్టర్లు.. ఐసీయూలో ఉన్న మున్నీని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కిరాతకంగా ప్రవర్తించిన భర్తతో పాటు అత్తామామల్ని పోలీసులు అరెస్టు చేశారు.