మైక్ టెస్టింగ్ 143 అంటున్న తారకరత్న

మైక్ టెస్టింగ్ 143 అంటున్న తారకరత్న

‘ఏదైనా సభ జరిగితే ‘మైక్ టెస్టింగ్ 123 అంటూ మైక్‌ని టెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ 143 అని చెప్పడమే మా సినిమాలో ప్రత్యేకం'' అని దర్శకుడు వీరు.కె చెప్పారు. నందమూరి తారకరత్న, అర్చన, నరేష్, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న ‘మైక్ టెస్టింగ్ 143' చిత్రం షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు దృశ్యానికి ఎస్వీ కృష్ణారెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, శ్రీనువైట్ల క్లాప్ ఇచ్చారు. 

సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. చక్కటి వినోదాన్ని పంచే చిత్రంలో తొలిసారిగా నటిస్తున్నానని తారకరత్న చెప్పారు. సీతగా మరోసారి కనిపించనున్నట్లు అర్చన చెప్పారు. ఈ నెల 26 నుంచి కొడెకైనాల్ శ్రీరాముని గుడి ప్రాంగణంలో షూటింగ్ చేస్తామని, రెండో నాయికను ఎంపిక చేయాల్సి ఉందని నిర్మాత రాజా తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అంజి