పారిస్ లో వెంకటేష్ "షాడో"

పారిస్ లో వెంకటేష్ "షాడో"

విక్టరీ వెంకటేష్ మరియు శ్రీకాంత్ ప్రధాన తారలుగా తెరకెక్కుతున్న చిత్రం "షాడో".  ఈ చిత్రం త్వరలో పారీస్ లో చిత్రీకరణ జరుపుకోనుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ మరియు మధురిమ బెనర్జీ ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. చాలా కాలం తరువాత వెంకటేష్ ఈ చిత్రంలో పూర్తి యాక్షన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ డాన్ పాత్రలో కనిపించబోతున్నారు. కొద్ది వారాల క్రితం మొదలయిన ఈ చిత్ర చిత్రీకరణ చాలా వరకు విదేశాల్లోనే జరుపుకోనుంది. యునైటడ్ మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. కోన వెంకట్ మరియు గోపి మోహన్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించగా తమన్ సంగీతం అందిస్తున్నారు.