నేను నయనతారతో నటించబోను: శింబు

నేను నయనతారతో నటించబోను: శింబు

నయనతారతో నన్ను చేర్చి మాట్లాడకండి. ఆమెతో నేను ఏ చిత్రంలోనూ నటించలేదు, నటించను కూడా అని హఠాత్తుగా ప్రకటించారు తమిళ నటుడు శింబు. నిజానికి అతనితో నయనతార "వల్లభ" అనే చిత్రంలో నటించింది. ఆ సమయంలోనే ఇద్దరూ బాగా దగ్గరయ్యారు. తర్వాత అది ప్రేమగా మారింది. హఠాత్తుగా ఏర్పడిన సమస్యల వల్ల ఇద్దరూ విడిపోయారు. తర్వాత ఆమె ప్రభుదేవా దర్శకత్వం వహించిన చిత్రంలో నటించింది. అప్పుడే వాళ్ళిద్దరూ ప్రేమిచుకోవడం మొదలు పెట్టారు. సుమారు రెండు సంవత్సరాలకు పైగా వాళ్ళ ప్రేమ కొనసాగింది. ప్రస్తుతం వారిమధ్య కూడా సమస్యలు ఏర్పడి విడిపోయారు. 

పెళ్ళి చేసుకుని మెట్టినింట్లో అడుగు పెట్టి గృహిణిగా జీవితాన్ని గడపాలని నిర్ణయంచుకుని సినిమాల్లో నటించడం మానేసింది నయనతార. కానీ, ప్రభుదేవా, నయనతారల మధ్య మనస్పర్ధలు రావడంతో తిరిగి ఆమె నటనా జీవితాన్ని ప్రారంభించింది.

అటువంటి పరిస్థితుల్లో శింబు తన చిత్రంలో ఆమెకు ఆఫర్ ఇచ్చాడనే వార్తలు వెలువడ్డాయి. శింబు ఆ వార్తలను ఖండించాడు. పైగా "నేను నటించిన ఏ చిత్రంలోనూ నయనతార నటించలేదు. సినిమాల్లో అయినా సరే, బయట అయినా సరే అమెతో నన్ను చేర్చకండి. నేను ఆమెతో ఎన్నటికీ నటించే ప్రసక్తి లేదు" అని చెప్పారు.