కరాచీలో కొనసాగుతున్న అల్లర్లు

కరాచీలో కొనసాగుతున్న అల్లర్లు

పాకిస్థాన్‌ కరాచీలో ఇంకా అల్లర్లు సద్దుమణగలేదు. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు చనిపోయారు. టెన్షన్‌ రాజ్యమేలుతోన్న కరాచీలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులపై అగంతకులు కాల్పులు జరిపారు. అనంతరం వారి వద్ద ఉన్న ఆయుధాలను తీసుకుని పారిపోయారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కరాచీలో కొద్ది రోజులుగా రాజకీయ హత్యలు జరుగుతున్నాయి. దీంతో నగరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. హింసాత్మక ఘటనలో నేపధ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.