మళ్లీ డేట్స్ ఇస్తానని పవన్ హామీ

మళ్లీ డేట్స్ ఇస్తానని పవన్ హామీ

పవన్ కళ్యాణ్ కీ, బండ్ల గణేష్ కి ఉన్న రిలేషన్ ఈ నాటిది కాదు.  బండ్ల గణేష్  కమిడియన్ గా ఉన్నప్పుడు సుస్వాగతం చేస్తూంటే పరిచయం అయ్యారు. అప్పటినుంచి వారిద్దరి మధ్యా స్నేహ భంధం కొనసాగుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్..తీన్ మార్ చేయటానికి డేట్స్ ఇచ్చారు. అయితే తీన్ మార్ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. దాంతో మళ్లీ గబ్బర్ సింగ్ కి డేట్స్ ఇచ్చి ..సూపర్ హిట్ కొట్టేలా చేసారు.

ఖుషీ తర్వాత పదేళ్ల అనంతరం ఆ రేంజి హిట్ కొట్టారు  పవన్ కళ్యాణ్  అని చెప్పుకుంటున్న నేపధ్యంలో గణేష్ కి మరో సినిమా కి డేట్స్ ఇస్తానని పవన్ ప్రామిస్ చేసాడని సమాచారం. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ఆ చిత్రం చేస్తానని చెప్పారని సమాచారం. అయితే ఆ చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం షూటింగ్ పూర్తయ్యాక చేద్దామని,ఈ లోగా..కథ,దర్సకుడు పైనలైజ్ చేద్దామని చెప్పారని పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. 

గణేష్ బాబు ప్రస్తుతం శ్రీను వైట్లతో చిత్రం చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందే ఈ చిత్రం టైటిల్ బాద్షా. పూర్తి కామెడీ ఎంటర్ట్నైమెంట్ తో రూపొందే ఆ చిత్రం మళ్లీ గబ్బర్ సింగ్ రేంజి సినిమా అవుతుందనే నమ్మకంగా ఉన్నారు. అఫ్పుడే బాద్షా చిత్రానికి బిజినెస్ ప్రారంభం కావటం చాలా సంతోషంగా ఉన్నాడు గణేష్. నెల్లూరు నుంచి మొదట అడ్వాన్స్ ఇచ్చి డిస్ట్రిబ్యూటర్స్ ఫైనలైజ్ చేసుకున్నారు. దూకుడు తర్వాత శ్రీను వైట్ల చేస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి.