షూటింగులో గాయపడ్డ మంచు మనోజ్

షూటింగులో గాయపడ్డ మంచు మనోజ్

హీరో మంచు మనోజ్ గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘ఊకొడతారా ఉలిక్కి పడతారా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి తానే స్వయంగా స్టంట్స్ కంపోజ్ చేస్తున్న మనోజ్ షూటింగులో స్టంట్స్ చేస్తుండగా గాయపడ్డాడు. ఈ ఘటనలో మనోజ్ కండరాలకు, ముక్కుకు తీవ్రమైన గాయాలయ్యాయి.

ఈ చిత్రాన్ని మంచు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మంచు లక్ష్మీప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నారు. శేఖర్ రాజా దర్శకుడు. దీక్షాసేథ్, పంచిబొరా కథానాయికలు. ఈ చిత్రంలో మంచు లక్ష్మీప్రసన్న ముఖ్య పాత్రను పోషిస్తోంది. 

బాలకృష్ణ పాత్ర సినిమాకు ప్రత్యేకాకర్షణగా వుంటుంది. షూటింగు దాదాపుగా పూర్తయిపోయింది. 'మిస్టర్ నూకయ్య'లోని ఫైట్స్‌ని తనే సమకూర్చుకున్న మనోజ్ ఊ కొడతారా ఉలిక్కిపడతారా లోని బాలయ్య ఇంట్రడక్షన్ ఫైట్‌కి మనోజ్ స్టంట్ డెరైక్టర్‌గా వ్యవహరించారు.

తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ జమిందార్ నరసింహ రాయుడుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో మనోజ్ సరసన దీక్షా సేథ్ నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రూ. 6.5 కోట్లతో గాంధర్వ మహల్ సెట్టింగ్ వేయడం ఇప్పుడు పరిశ్రమ వర్గాలను షాక్ కు గురి చేస్తోంది. లక్ష్మి అంత ఖర్చు పెట్టి సెట్ వేసి సాహసం చేస్తుండటం చర్చనీయాంశం అయింది. అయితే బాలయ్య క్యారెక్టర్ గురించే ఆ సెట్ వేశారట. ఇందులో ఆయన జమిందార్ పాత్రలో కనిపించబోతున్నారు. బాలయ్య కు ఉన్న ఫాలోయింగ్‌తో సినిమా హిట్ అవుతుందనే నమ్మకంలో ఉన్నారంతా.