దగ్గుపాటి రానా నిర్మాతగా చిత్రం

దగ్గుపాటి రానా నిర్మాతగా చిత్రం

  దగ్గుపాటి రానా ...త్వరలో నిర్మాతగా మారనున్నారు. తన తాత,తండ్రి వారసత్వాన్ని నిలబెట్టనున్నారు. అయితే ఆ చిత్రం తెలుగు లో నిర్మించనని చెప్తున్నారు. వచ్చే యేడాది హిందీలో సినిమాలు నిర్మించాలనే ఆలోచన ఉందని ఆయన స్పష్టం చేశారు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'డిపార్ట్‌మెంట్‌'చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా రానా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియచేసారు.'దమ్‌ మారో దమ్‌' చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టిన రానా అక్కడే నిర్మాతగా మారనుండటంతో బాలీవుడ్ ఆనందం వ్యక్తం చేస్తోంది. అయితే రానా చేయబోయే చిత్రాన్ని ఎవరు డైరక్ట్ చేస్తారు అనే విషయం తెలియచెయ్యలేదు. 


రానా మాటల్లోనే..''హిందీలో సినిమాలు తీసేందుకు ఓ పూర్తి ప్లానింగ్ ఉంది. ఎంటర్నైన్ మెంట్ తో సాగే మంచి చిత్రాలకే నా ప్రాధాన్యం. రీమేక్‌లు మాత్రం చేయను. వచ్చే యేడాదిలో నన్ను నిర్మాతగా చూడొచ్చు'' అన్నారు. దానికి మీడియావారు మరి హిందీ చిత్రానికి సంబంధించిన నిర్మాణ మెళకువల్ని నేర్చుకొంటున్నారా అని అడిగారు. దానికి సమాధానమిస్తూ...''చిత్ర నిర్మాణం అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఒకేలాగే ఉంటుంది. ఒక నటుడిగా నిర్మాణాన్ని బాగా అర్థం చేసుకొనే అవకాశం కూడా నాకుంది'' అన్నారు. 

మరో ప్రక్క రానా ఓ హాలీవుడ్ చిత్రం చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అప్పట్లో ట్రైల్ షూట్ కూడా జరిగింది. ఆ చిత్రానికి టైటిల్ గా ఎ మొమంటరీ లాప్స్ ఆఫ్ రీజన్ అనే టైటిల్ పెట్టారు. లాస్ ఏంజిల్స్ లో సెటిల్ అయిన ఇండియన్ బిజినెస్ మ్యాన్ గా రానా కనిపించనున్నాడు. అక్కడ సిటిలో ఉన్న అండర్ వరల్డ్ మీద రివేంజ్ తీర్చుకునే పాత్ర ఆయనది. ఆదిత్య బట్టాచార్య అనే డైరక్ట్రర్ దీనిని డైరక్ట్ చేయనున్నాడు. ఆదిత్య బట్టాచార్య గతంలో అమీర్ ఖాన్ తో రాఖ్ అనే చిత్రం రూపొందించారు. బసు బట్టాచార్య కుమారుడైన ఆదిత్య ఆ తర్వాత కొన్ని యుఎస్ ప్రాజెక్టులలో బిజీ అయ్యారు. ఆ తర్వాత సెన్సో యునీకో అనే ఇటాలియన్ చిత్రం రూపొందించారు. ఇక దమ్ మారో దమ్ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రానా ని చూసి ఎంపిక చేసుకన్నాడని, ట్రైల్ షూట్ కూడ రహస్యంగా హైదరాబాద్ లోనే జరిగిందని చెప్తున్నారు.

ఇక రానా తెలగులో చేసిన రీసెంట్ చిత్రం నా ఇష్టం. జెనీలియా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రకాష్ తోలేటి అనే దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ప్రస్తుతం రానా తెలుగులో క్రిష్ దర్శకత్వంలో కృష్ణం వందే జగద్గురం చిత్రం చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. డిపార్టమెంట్ చిత్రం ఈ నెల 18 న విడుదల అవుతోంది. డిపార్టమెంట్ లో రానా పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.