రవితేజకు, దరువు నిర్మాతకు మధ్య గొడవ

రవితేజకు, దరువు నిర్మాతకు మధ్య గొడవ

మాస్ మహారాజ రవితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ దరవు '. సౌండ్ ఆఫ్ మాస్ అనే ఉప శీర్షికతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ ఈ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన ఈచిత్రం విడుదలను మే 25కు వాయిదా వేశారు.

కాగా... ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రవితేజకు, ఈచిత్ర నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణకు గొడవలొచ్చాయని సమాచారం. సినిమా షూటింగ్ పూర్తయినప్పటి నుంచి రవితేజ ప్రొడ్యూసర్‌ను కలవడానికి ఇష్ట పడటం లేదని తెలుస్తోంది. ఓ విషయంలో ఇద్దరు వాదులాడుకోవడమే ఇందుకు కారణం అంటున్నారు. 

ఆ మధ్య దరువు ఆడియోకు రవితేజ హాజరుకాక పోవడానికి కూడా కారణం ఈ గొడవేనట. అయితే తమ గొడవ గురించి ఎవరికీ అనుమానం రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రవితేజ దరువు ఆడియోలో పాల్గొన్నారని అంటున్నారు. మున్ముందు దరువు ప్రమెషన్లలో కూడా రవితేజ పాల్గొనే అవకాశం లేదంటున్నారు. అందరితో మంచి సంబంధాలు మెయింటేన్ చేసే రవితేజ దరువు ప్రొడ్యూసర్ తో గొడవ పడటం ఫిల్మ్ నగర్లో చర్చనీయాంవం అయింది.

ప్రస్తుతం రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘దేవుడు చేసిన మనుషులు' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో  రవితేజ సరసన ఇలియాన నటిస్తోంది.