జగన్ పార్టీలో గజదొంగలు

జగన్ పార్టీలో గజదొంగలు

కాంగ్రెసు పార్టీలో దొంగలుంటే, జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో గజదొంగలున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఆయన శుక్రవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. కాంగ్రెసు,  వైయస్సార్ కాంగ్రెసు పార్టీలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. పత్రికాస్వేచ్ఛకు ఏ విదమైన ముప్పు లేదని, అవినీతి ప్రమాదకరంగా పరిణమించిందని ఆయన అన్నారు. 

తమ పార్టీ నాయకులను కాకుండా కార్యకర్తలను నమ్ముకుందని ఆయన చెప్పారు. బెల్టు షాపులు పెట్టి చీప్ లిక్కర్ అమ్ముతున్నారని ఆయన కాంగ్రెసు పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు. మద్యం సిండికేట్లు పెట్టారని, బినామీ పేర్లతో మద్యం దుకాణాలు నడుపుతున్నారని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మద్యం సిండికేట్లతో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. హైదరాబాదులోని గాంధీభవన్‌ను బ్రాందీభవన్‌గా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. 

కాంగ్రెసు నాయకులకు సిగ్గు లేదని, ప్రజాప్రయోజనాలను కాపాడలోకపోతోందని ఆయన అన్నారు. ప్రజలను మత్తులో ముంచి పాలించాలని కాంగ్రెసు పార్టీ భావిస్తోందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి బిసిలకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పాలన ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాల మయంగా మారిందని ఆయన అన్నారు. పత్రికా స్వేచ్ఛను, జగన్ మీడియాను వేర్వేరుగా చూడాలని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అవినీతిని, మాఫియాలను ముఖ్యమంత్రి కట్టడి చేయలేకపోతున్నారని ఆనయ అన్నారు. అన్ని కుంభకోణాల్లోనూ కాంగ్రెసు పాత్ర ఉందని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చేతకాని దద్దమ్మ అని, పనికిమాలిన ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మాటను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు ఆంజనేయస్వామి దేవాలయం పూజలు చేశారు