చిరంజీవి 150వ చిత్రానికి శంకర్ దర్శకత్వం?

చిరంజీవి 150వ చిత్రానికి శంకర్ దర్శకత్వం?

పొలిటికల్ లీడర్‌గా మారిన టాలీవుడ్ మెగా యాక్టర్ చిరంజీవి. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈ పొలిటికల్ హీరో... త్వరలో తన 150వ చిత్రంలో నటించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. సామాజిక స్పృహతో నిర్మించనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్న చర్చ టాలీవుడ్‌లో జోరుగానే కొనసాగుతున్నాయి. 

గతంలో చిరంజీవి నటించిన 'ఠాగూర్' చిత్రానికి దర్శకత్వం వహించిన వివి.వినాయక్‌ను దర్శకుడిగా ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత శ్రీనువైట్ల పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. కోలీవుడ్ దర్శకుడు శంకర్ పైరు వినిపిస్తోంది. 

కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర దర్శకులు, హీరోలు, సినీ ప్రముఖులతో మెగా ఫ్యామిలీకి మంచి పరిచయాలే ఉన్నాయి. వారందరి సూచనలు, సలహాల మేరకు తన 150 చిత్రానికి శంకర్‌ను దర్శకుడిగా ఎంచుకోవాలన్న ఆలోచనలో చిరు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై చిరంజీవి-శంకర్‌ల మధ్య కూడా రహస్య చర్చలు కూడా జరిగినట్టు వినికిడి.