YSR పనులకు కిరణ్‌ ప్రారంభోత్సవాలు

YSR పనులకు కిరణ్‌ ప్రారంభోత్సవాలు

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపనలు చేసి పూర్తైన పనులకు ప్రస్తుత సీఎం కిరణ్‌ ప్రారంభిస్తున్నారని YSR కాంగ్రస్‌ పార్టీ అధినేత జగన్‌ ఆరోపించారు. కడప జిల్లా రాయచోటిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జగన్‌. రవిథియేటర్‌ సర్కిల్‌ నుంచి కొత్తపల్లి, ట్రంకురోడ్డు, మాసాపేట, కంసలవీధి, గాంధీబజారు మీదుగా సాగిన రోడ్డు షోలకు జనం నుంచి విశేష ఆదరణ లభించింది. విలువుల, విశ్వసనీయత కోసం పనిచేసిన శ్రీకాంత్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి సువర్ణ పాలనకు నాంది పలకాలని ఓటర్లకు యువనేత పిలుపునిచ్చారు.