చరణ్ పెళ్లిపై అమితాబ్ ట్విట్టర్ కామెంట్

 చరణ్ పెళ్లిపై అమితాబ్ ట్విట్టర్ కామెంట్

రామ్ చరణ్ పెళ్లికి హైదరాబాద్ నిన్న ఉదయం వచ్చిన హిందీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. వధూవరులను ఆశ్వీరదించిన  అమితాబ్ రాత్రే ముంబైలోని తన ఇంటికి చేరుకున్నారు. తాను ఈ పెళ్లిని చాలా ఆశ్వాదించానని,సంప్రదాయాలకు పెద్ద పీట వేసే ఇలాంటి పెళ్లిళ్లకు బాగుంటాయంటూ ఆయన ట్విట్టర్ లో తన అనుభూతి ని పంచుకున్నారు.

ఆ ట్వీట్ లో....పెళ్లి నుంచి తిరిగి వచ్చాను. దేశంలో ఏ ప్రాంతంలో అయినా భారతీయ సాంప్రదాయ లతో కూడిన ఈవెంట్స్ చాలా మనోహరమైన ఉంటాయి. మన సంస్కృతి చాలా సంపర్నమైనది అంటూ ట్వీట్ చేసారు. ఆయన ఈ ట్వీట్ లో రామ్ చరణ్ పేరు ప్రస్దావించకపోయినా ఈ పెళ్లి గురించే అని తెలిసిందే. ఆయన ఈ పెళ్లిని బాగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం.

ప్రముఖ సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కొణిదెల  చిరంజీవి కుమారుడు హీరో రాంచరణ్ తేజ, ప్రముఖ వ్యాపారవేత్త అపోలో ప్రతాప్‌రెడ్డి మనుమరాలు కామినేని ఉపాసనల పెళ్లి గురువారం ఉదయం హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీ ప్రముఖులు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, సూపర్‌స్టార్ రజనీకాంత్, డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావు, మోహన్‌బాబు దంపతులు వచ్చారు.