శ్రీలక్ష్మి బెయిల్‌పై తీర్పు రిజర్వ్

శ్రీలక్ష్మి బెయిల్‌పై తీర్పు రిజర్వ్

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) గనుల అక్రమ తవ్వకాల కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం వాదనలు ముగిశాయి. దీనిపై హైకోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుత విషయాలు మాత్రమే ప్రస్తావించాలని కోర్టు సిబిఐకి సూచించింది.

ఒఎంసి కేసులో కేంద్ర ప్రభుత్వాధికారులను ప్రశ్నించారా అని కోర్టు సిబిఐని ప్రశ్నించింది. వారిని ప్రశ్నించేందుకు ఏమైనా ఇబ్బందులున్నాయా అని హైకోర్టు సిబిఐని అడిగింది. ఒఎంసి కేసులో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మి అరెస్టయ్యారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్ బెయిల్ పిటిషన్‌పై విచారణను నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది.

బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ఇరు వర్గాల వాదనలు ఉన్న కోర్టు ఈ మేరకు విచారణను వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల అరెస్టైన నిమ్మగడ్డ చంచల్‌గూడ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. వైయస్ జగన్ కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.