'అసెంబ్లీ రౌడీ'రీమేక్ ఖరారు..డిటేల్స్

'అసెంబ్లీ రౌడీ'రీమేక్ ఖరారు..డిటేల్స్

మోహన్ బాబు హీరోగా చేసిన 'అసెంబ్లీ రౌడీ'ఆ రోజుల్లో సూపర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలోని అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే నిన్ను కూడా జైల్లోపెడతా... అనే డైలాగులు అప్పట్లో ఎక్కడ విన్నా వినపడేవి. దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ 'అసెంబ్లీ రౌడీ'చిత్రం రీమేక్ కాబోతోంది.

మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా ఈ చిత్రం రూపొందనుంది.ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుంది. ఈతరానికి నచ్చేలా, వర్తమాన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మార్పుచేర్పులు చేస్తున్నారు. ప్రస్తుతం కథాచర్చలు సాగుతన్నాయి. విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'దేనికైనా రెడీ' చిత్రీకరణ తుది దశకు చేరింది. ఈ చిత్రం పూర్తయిన తరవాత 'అసెంబ్లీ రౌడీ' సెట్స్‌ మీదకు వెళ్తుంది. పరుచూరి బ్రదర్శ్ ఈ మేరకు కొత్త స్క్ర్రిప్టుని రెడీ చేస్తున్నారు.


అలాగే ఈ చిత్రంలో 'అందమైన వెన్నెలలోన'పాటని సైతం రీమిక్స్ చేస్తారని తెలుస్తోంది. అయితే డైరక్టర్ ఎవరనేది ఖరారు కాలేదు. ఇక హీరోయిన్ గా తాప్సీ ని ఎంపిక చేయనున్నారని వినపడుతోంది. తాప్సీ ఇదే బ్యానర్ ద్వారా ఝుమ్మందినాదం చిత్రంతో పరిచయమైంది. లక్ష్మి ప్రసన్న బ్యానర్ లోనే వరసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఇదే బ్యానర్ లో రూపొందుతున్న గుండెళ్లో గోదావరి చిత్రం చేస్తోంది.