7 ఏళ్ల తర్వాత రవితేజ, దేవిశ్రీ కాంబినేషన్

7 ఏళ్ల తర్వాత రవితేజ, దేవిశ్రీ కాంబినేషన్

దాదాపు 7 సంవత్సరాత తర్వాత మాస్ మహారాజ్ రవితేజ, మాస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వెంకీ, భద్ర చిత్రాలు అప్పట్లో మ్యూజికల్‌గా మంచి విజయం సాధించాయి. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోంది. ‘సార్ వస్తారా' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వైజయంతి మూవీస్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన కాజల్, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జులై 1 నుంచి ఊటీలో ప్రారంభం కానుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో మాస్ మసాలా సాంగులు రిపీట్ అవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు.

రవితేజ బాడీ లాంగ్వేజ్‌కి తగినట్లుగా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా రూపొందబోతోంది. యాక్షన్ తో పాటు మంచి ఎంటర్ టైన్మెంట్స్ హై టెక్నిక్ వ్యాల్యూస్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దానికి తగిన విధంగా దేవిశ్రీ బాణీలు సమకూర్చనున్నారు.

దేవిశ్రీ ఇటీవల సంగీతం అందించిన గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ తేజ్ హీరోగా వస్తున్న బాలీవుడ్ మూవీ జంజీర్ చిత్రానికి కూడా దేవిశ్రీ మ్యూజిక్ అందించబోతున్నాడు. అతను మ్యూజిక్ అందించి ‘జులాయి' చిత్రం ఆడియో విడుదలై విజయవంతం అయింది.