లక్ష క్లబ్‌లో చేరిన హీరో రామ్

లక్ష క్లబ్‌లో చేరిన హీరో రామ్

ఎనర్జిటిక్ హీరో రామ్ పాపులారిటీ రోజు రోజుకు పెరిగి పోతుంది. తాజాగా ఈ హీరో లక్ష క్లబ్‌లో చేరాడు. లక్ష క్లబ్ అంటే మరేదో కాదు....ట్విట్టర్లో ఈ హీరోని ఫాలో అవుతున్న అభిమానుల సంఖ్య లక్ష క్రాస్ అయింది. నిర్మాత రవికిషోర్‌కు బంధువైన రామ్ సులభంగానే హీరో‌గా దక్కించుకున్నప్పటికీ....తనదైన టాలెంట్‌తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజాగా రామ్ నటించిన ‘ఎందుకంటే ప్రేమంట' చిత్రం ఈ రోజు విడుదలైంది. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ చిత్రం తొలి రోజు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కథలో లోపమే సినిమాకు మైనస్ అయింది అంటున్నారు. కరుణాకరన్ టేకింగ్ కూడా ఆకట్టుకోలేదని చర్చించుకుంటున్నారు.

కథ విషయం ప్రక్కన పెడితే హీరో రామ్ తన దైన శైలిలో చాలా సీన్స్ లో చక్కగా మెచ్యూరిటీ తో చేసుకుంటూ పోయాడు. తమన్నా రెగ్యులర్ ఎక్సప్రెషన్స్ తో లవ్ సీన్స్ పండించే ప్రయత్నం చేసింది. అయితే సినిమా అంతా ఒకటే డ్రస్ వేసుకుని తమన్నా ఇబ్బంది పెడుతుంది. విలన్ లుగా పరిచయం చేసిన ఒకప్పటి హీరో రిషి, రైటర్ కోన వెంకట్ లు తమ పాత్రలకు న్యాయం చేసారు.

బ్రహ్మానందం కామెడీ బాగానే పేలినా కథకు సంబంధం లేకుండా పోయింది. డైలాగులు కేవలం కామెడీ సీన్స్ లో మాత్రమే బాగున్నాయి. ఛాయాగ్రహణం అందించిన ఆండ్రూ ఈ సినిమాకు ఉన్న ఏకైక ప్లస్ అని చెప్పాలి. ఎడిటింగ్ మరింత షార్పు గా అంటే సెకండాఫ్ దాదాపు ఓ అరగంట ట్రిమ్ చేయవచ్చు అనిపించింది. పాటలు విన్నప్పటికంటే చూస్తున్నప్పుడే విజువల్ గా బాగున్నాయి.

జివి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, నిర్మాత: పి.రవికిషోర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్.