బాలయ్య సినిమా మళ్లీ వాయిదా!

బాలయ్య సినిమా మళ్లీ వాయిదా!

 ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. తొలు ఈచిత్రాన్ని జూన్ 22న విడుదల చేసేయాలని ప్లాన్ చేశారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ జులై మెదటి వారానికి వాయిదా పడింది.

ఈ చిత్రం వాయిదాకు కారణం పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాక పోవడమే అని స్పష్టమవుతోంది. శేఖర్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం బాలయ్య ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయన జమిందార్ పాత్ర పోషిస్తున్నారు. సినిమాకు రూ. 6 కోట్లతో వేసిన గాంధర్వ మహల్ సెట్ హైలెట్‌గా నిలవనుంది. సినిమా ఎక్కువ శాతం షూటింగు ఇందులోనే జరిగింది.

బాలయ్య ఈ చిత్రంలో ఆత్మ రూపంలో కనిపించనున్నారు. గాంధర్వ మహల్లోకి హీరో మనోజ్ ప్రవేశించాక కథ మొదలవుతుందని, అక్కడ బాలకృష్ణ ఆత్మ కలుస్తుందని, హర్రర్, కామెడీ కలగలిసే ఈ సన్నివేశాల్లో బాలకృష్ణ ప్లాష్ బ్యాక్ విన్న హీరో ఆయన ఆశయం తీర్చటమే సినిమా ముఖ్య కథాంశం అని తెలుస్తోంది. మనోజ్ సరసన దీక్షాసేథ్ నటిస్తోంది.

బాలకృష్ణ, ప్రభు, మనోజ్, దీక్షాసేథ్, లక్ష్మీ ప్రసన్న, సోనూసూద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రాన్ని మంచు లక్ష్మి ప్రసన్న మంచు ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తోంది. ఈ చితానికి కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం శేఖర్ రాజ. బెబో శశి సంగీతం అందిస్తున్నారు. బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.