ఉదయ్ కిరణ్ ‘జై శ్రీరామ్'...ఫస్ట్‌లుక్

ఉదయ్ కిరణ్ ‘జై శ్రీరామ్'...ఫస్ట్‌లుక్

చిత్రం, నువ్వునేను చిత్రాల తర్వాత సరైన హిట్ లేని ఉదయ్ కిరణ్ చాలా కాలంగా వెండి తెరకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ‘జై శ్రీరామ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. రేష్మా కథానాయిక. ఈ చిత్రానికి బాలాజీ ఎన్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు ఉదయ్ కిరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని యూనిట్ సభ్యులంతా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈచిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ...జై శ్రీరామ్ మంచి ఉద్దేశ్యంతో తీస్తున్న మూవీ. 12 సంవత్సరాలుగా లవర్ బాయ్‌గా కనిపించిన నేను ఈ చిత్రంలో యాక్షన్ హీరోగా కనిపిస్తాను. రేష్మా ఈచిత్రంలో మంచి క్యారెక్టర్ చేస్తుంది. నా కెరియర్‌కి ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలబడుతుంది అన్నారు.

దర్శకుడు బాలాజీ ఎన్ సాయి మాట్లాడుతూ. ఈ చిత్రంలో నాలుగు గెటప్‌ల్లో కనిపిస్తాడు. ఓ సిద్ధాంత పరమైన క్యారెక్టర్‌తో, బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఆయన సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. నేను ఏది అడిగినా సమకూర్చే నిర్మాతలు నాకు దొరికారు. సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పగలను అని అన్నారు.

నిర్మాత తేళ్ల రమేష్ మాట్లాడుతూ... దర్శకుడు చెప్పిన కథ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అందుకే సినిమా తీయడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈచిత్రంలో ఎమ్మెస్ నారాయణ, తాగుబోతు రమేష్, నాగినీడు, చలపతిరావు, గిరిధర్ తదితరులు నటిస్తున్నారు. ఆర్ట్: భాస్కరరాజు, ఫైట్స్: డ్రాగన్ ప్రాకాష్, ఫోటోగ్రఫీ: శివ, మురళి, సంగీతం: బాలాజీ(డాకే),