బ్రహ్మానందం 'జఫ్ఫా' ట్రైలర్

బ్రహ్మానందం 'జఫ్ఫా' ట్రైలర్

                         http://www.youtube.com/ watch?v=nMS28JCdvuI
స్టార్ కమిడెయిన్ బ్రహ్మానందం జప్పా టైటిల్ తో ఓ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెన్నెల కిషోర్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో బ్రహ్మానందం..సంకెళ్లతో ఓ పోలీస్ అధికారి పట్టుకుని ఉంటాడు. అతన్ని నీ పేరేంటి అని అడుగుతాడు. ఎదురుగా ఉన్న బ్రహ్మానందం చెప్పడు. ఇరిటేషన్ తో ఆ పోలీస్ అధికారి..నీ పేరేంటిరా జప్పా అని అరుస్తాడు. అప్పుడు బ్రహ్మానదం..నా పేరు అదే అని కూల్ గా చెప్పుతాడు. ఆ తర్వాత బ్రహ్మానందం మర్డర్ చేయలేదు,రేప్ చేయలేదు,కిడ్నాప్ చేయలేదు అయినా మోస్ట్ వాంటెడ్ అని వస్తుంది. త్వరలోనే దొరుకుతాడు అనే టైటిల్ కార్డుతో ఈ ట్రైలర్ ముగుస్తుంది.

అందిన సమాచారం ప్రకారం రీసెంట్ గానే షెడ్యూల్ పూర్తి చేసుకున్న  ఈ చిత్రంలో బ్రహ్మానందం జఫ్పా ఖాన్ పాత్రను పోషిస్తున్నట్లు  తెలుస్తోంది. కథ ప్రకారం.. ఇండియన్ పోలీసులుకు చిక్కిన పాకిస్ధాన్ టెర్రరిస్ట్ జఫ్ఫా ఖాన్. ఇండియన్ జైలు నుంచి అతను ఎలా తప్పించుకున్నాడనేది కథలో కీలకాంశంగా ఉంటుంది. అలాగే అతని పోలికలతోనే ఉన్న మరో అమాయిక బ్రహ్మానందాన్ని అడ్డం పెట్టుకుని బయిటపడాలనుకుంటాడు. ఆ క్రమంలో ఏం జరిగింది అనేది కామిడీతో జరిగే కథనం. అలాగే బ్రహ్మానందం తన ఒరిజనల్ తెల్ల గెడ్డంతో జఫ్ఫా ఖాన్ పాత్రలో కనపిస్తారు.

ఈ చిత్రం హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఓ స్టార్ హీరోయిన్ గెస్ట్ పాత్ర చేస్తున్న ఈ చిత్రాన్ని మరో కమిడెయిన్ వెన్నెల కిషోర్ స్క్రిప్టు వర్క్ చేసి మెప్పించి,డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం లీడ్ రోల్ లో బ్రహ్మానందం కనిపిస్తారు. ఇక టాకీ పార్ట్ పూర్తయ్యాక భారీగా ఈ చిత్రం డిటేల్స్ ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇక ఢీ చిత్రం నుంచి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బ్రహ్మానందం ఇప్పుడు హీరోలతో సమానంగా సినిమాల్లో లీడ్ రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన మహేష్ దూకుడులోనూ బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ రోల్ ని చేసారు. ఇక వెన్నెల కిషోర్ డైరక్ట్ చేసిన 'వెన్నెల వన్‌ అండ్‌ హాఫ్‌'చిత్రం కూడా విడుదలకు సిద్దంగా ఉంది.

వెన్నెల కిషోర్ దర్శకుడుగా మారి రూపొందిస్తున్న చిత్రం 'వెన్నెల వన్‌ అండ్‌ హాఫ్‌'. ఈ చిత్రం కథ బ్యాంకాక్ లో జరుగుతుంది. స్టోరీలైన్ చూస్తే...విజయవాడలోనో, హైదరాబాద్‌లోనో చదివితే ఏం వస్తుంది? మహా అయితే మంచి ఉద్యోగం వస్తుంది. అదే... విదేశాలకెత్తే వూర్లో మంచి క్రేజ్‌ వస్తుంది. పైగా అక్కడి అమ్మాయిల్ని పటాయించొచ్చు. వారాంతాల్లో కావల్సినంత హంగామా చేయొచ్చు. ఆ అబ్బాయి కూడా అలాగే అనుకొన్నాడు. వెంటనే విమానం ఎక్కేశాడు. మరి అమ్మాయిల మనసులో స్థానం సంపాదించాడా? లేదా? ఈ విషయాలు తెలియాలంటే 'వెన్నెల వన్‌ అండ్‌ హాఫ్‌' చూడాల్సిందే. చైతన్యకృష్ణ, మోనాల్‌ గజ్జర్‌ జంటగా నటించున ఈ చిత్రాన్ని వాసు, వర్మలు నిర్మించారు.